Qatar: పశ్చిమాసియాలో కలకలం.. ఖతార్ తీరంలో సరకు రవాణా నౌకపై దాడి!
Qatar: ఖతార్ తీరంలో బల్క్ క్యారియర్ నౌకపై గుర్తుతెలియని డ్రోన్ లేదా క్షిపణితో దాడి జరిగింది. దోహా సమీపంలో జరిగిన ఈ ఘటనతో పర్షియన్ గల్ఫ్‌లో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.
Qatar: పశ్చిమాసియాలో కలకలం.. ఖతార్ తీరంలో సరకు రవాణా నౌకపై దాడి!
Qatar: పశ్చిమాసియా సముద్ర జలాల్లో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఖతార్ రాజధాని దోహా సమీపంలో భారీ కంటైనర్లను తీసుకెళ్తున్న ఓ బల్క్ క్యారియర్ నౌకపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. డ్రోన్ లేదా క్షిపణితో జరిగిన ఈ దాడి కారణంగా నౌకలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
బ్రిటిష్ మిలిటరీకి చెందిన యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) ఆదివారం ఈ మేరకు వివరాలను వెల్లడించింది. ఖతార్ రాజధాని దోహాకు సుమారు 23 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది. గుర్తుతెలియని ఆయుధం నౌకను బలంగా తాకడంతో మంటలు వ్యాపించాయి. అయితే, నౌకలోని సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని యూకేఎంటీఓ ధృవీకరించింది.
అమెరికా-ఇరాన్ మధ్య ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతున్న తరుణంలో, పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఈ దాడి జరగడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఈ దాడికి పాల్పడింది ఎవరు? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అలాగే దాడికి గురైన నౌక ఏ దేశానికి చెందినది, అందులో ఉన్న సరకు ఏమిటి అనే వివరాలను అధికారులు రహస్యంగా ఉంచారు. అంతర్జాతీయ నౌకాయాన మార్గాల్లో ఇలాంటి దాడులు జరగడం పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితులపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తోంది.




