Congo: కాంగోలో ఘోర అగ్నిప్రమాదం పెళ్లి వేడుకలో మంటలు, 22 మంది మృతి!
Congo: కాంగో రాజధాని కిన్షాసాలోని లింగ్వాలాలో పెళ్లి వేడుక జరుగుతున్న భవనంలో ఘోర అగ్నిప్రమాదం.
Congo: కాంగోలో ఘోర అగ్నిప్రమాదం పెళ్లి వేడుకలో మంటలు, 22 మంది మృతి!
Congo: కాంగో రాజధాని కిన్షాసాలోని ఒక వివాహ వేడుకలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 22 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. లింగ్వాలా ప్రాంతంలో ఉన్న ఓ భవనంలో వివాహ వేడుక జరుగుతుండగా ఆకస్మత్తుగా మంటలు చెలరేగాయి.
ఇరుకైన కారిడార్ల కారణంగా మంటల నుంచి తప్పించుకోవడానికి జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంతమంది భవనం లోపల నుంచి సురక్షితంగా బయటకు వచ్చేయగా, మరికొంతమంది చిక్కుకుపోయారు. దీంతో భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరిగింది. ప్రమాద సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ, అగ్నిమాపక సిబ్బంది బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
పలు మృతదేహాలను వెలికితీయగా క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు, ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కాంగో ఉప ప్రధాని జాక్వెమిన్ షబానీ ఇదొక పెను విషాదమన్నారు.




