Trump Warning to Iran: 'ఇక మీదట అంత మంచివాడిగా ఉండను'.. రైఫిల్ పట్టుకున్న ఫోటోతో ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!
Trump Warning to Iran: ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. తుపాకీ పట్టుకున్న ఫోటోను షేర్ చేస్తూ, ఇకపై తాను అంత మంచివాడిగా ఉండనని ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు.
Trump Warning to Iran: 'ఇక మీదట అంత మంచివాడిగా ఉండను'.. రైఫిల్ పట్టుకున్న ఫోటోతో ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!
Trump Warning to Iran: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరోసారి తన దూకుడును ప్రదర్శించారు. అణు కార్యక్రమాల విషయంలో ఇరాన్ తన పంథా మార్చుకోకపోతే అమెరికా కఠిన వైఖరిని అవలంబిస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ (Truth Social) లో తుపాకీ పట్టుకున్న ఫోటోను షేర్ చేస్తూ చేసిన పోస్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
అణు ఒప్పందానికి సంబంధించి దౌత్యపరమైన పరిష్కారం త్వరలో లభించకుంటే అమెరికా నుంచి గట్టి సమాధానం ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. "ఇరాన్ తెలివిగా వ్యవహరిస్తే ఆ దేశానికే మంచిది. చర్చల విషయంలో ఇరాన్ సరిగ్గా స్పందించలేకపోతోంది. అణు ఒప్పందాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో వారికి అర్థం కావడం లేదు" అని ఆయన విమర్శించారు.
'నేను ఇక మంచివాడిని కాదు'
తన పోస్ట్‌లో ట్రంప్ అత్యంత తీవ్రమైన పదజాలం వాడారు. "ఇక మీదట నేను అంత మంచివాడిగా ఉండను" (I’m not going to be nice anymore) అని పేర్కొంటూ, అమెరికా ప్రతిపాదనలను ఇరాన్ తిరస్కరిస్తే తాము మరింత దూకుడుగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. పశ్చిమాసియాలో ఇప్పటికే యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ట్రంప్ నుంచి వచ్చిన ఈ ప్రకటన ఉద్రిక్తతలను మరింత పెంచేలా ఉంది.




