Donald Trump: సలాడ్లు, స్మూతీలు వద్దు.. బర్గర్లు, కోక్‌లే ముద్దు.. ట్రంప్ డైట్ ప్లాన్ చూసి షాకవుతున్న డాక్టర్లు

Donald Trump: ప్రపంచ దేశాల అధినేతలు ఎల్లప్పుడూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతూ, పోషకాహార నిపుణులు చెప్పే డైట్‌ను ఫాలో అవుతుంటారు.

CR Reddy
Published on: 25 Sept 2026 8:26 AM IST
Donald Trump
X

Donald Trump

Donald Trump: ప్రపంచ దేశాల అధినేతలు ఎల్లప్పుడూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతూ, పోషకాహార నిపుణులు చెప్పే డైట్‌ను ఫాలో అవుతుంటారు. కానీ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహారపు అలవాట్లు మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఏలాంటి న్యూట్రిషన్ లెక్కలు పట్టించుకోకుండా, పూర్తిగా ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్‌పై ఆధారపడే ఆయన డైట్ చూస్తే ఏ డైటీషియన్ అయినా షాక్ కావాల్సిందే. నిత్యం ఆరోగ్యకరమైన ఆహారం కోసం అందరూ ప్రయత్నిస్తుంటే, ట్రంప్ మాత్రం తనకెంతో ఇష్టమైన బర్గర్లు, కెచప్, కోక్‌లతో తనదైన ప్రత్యేక ఆహార శైలిని కొనసాగిస్తున్నారు.

రోజూ 12 టిన్ల డైట్ కోక్

డొనాల్డ్ ట్రంప్ డైట్ కోక్‌కు ఎంతగా బానిస అయ్యారంటే.. ఆయన రోజుకు ఏకంగా 12 కేన్ల వరకు డైట్ కోక్ తాగుతుంటారట. వైట్ హౌస్‌లో తన అధ్యక్ష కార్యాలయంలో ఉన్న సమయంలో, కేవలం ఒక్క బటన్ నొక్కితే చాలు తనకు ఇష్టమైన కోక్ కేన్ అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. ఒక టిన్ లో ఉండే హై కేఫిన్, ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్ ఆరోగ్యాన్ని పాడుచేస్తాయని వైద్యులు ఎంత వారించినా, ట్రంప్ మాత్రం తన ఈ అలవాటును ఎప్పుడూ మార్చుకోలేదు. నిపుణులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, ఆయన మాత్రం దీనిని తన రోజువారీ శక్తికి ప్రధాన వనరుగా భావిస్తారు.

ఫాస్ట్ ఫుడ్స్, బర్గర్లు, కెచప్ అంటే మహా ఇష్టం

కేవలం డైట్ కోక్ మాత్రమే కాకుండా, ట్రంప్‌కు ఫ్రైడ్ చికెన్, పిజ్జా, బర్గర్లు అంటే అమితమైన ప్రాణం. ఆయన ప్రయాణించే ప్రైవేట్ జెట్‌లో ఎప్పుడూ కేఎఫ్‌సీ, మెక్‌డొనాల్డ్స్, పిజ్జా వంటి ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ స్టాక్ ఉండేలా చూసుకుంటారు. మెక్‌డొనాల్డ్స్ నుంచి క్వార్టర్ పౌండర్ చీజ్ బర్గర్, ఎక్స్ట్రా కెచప్, ఫ్రైడ్ ఆపిల్ పై వంటివి ఆయనకు అత్యంత ఇష్టం. డిన్నర్ సమయంలో ఏకంగా రెండు బిగ్ మాక్స్, రెండు ఫిలెట్-ఓ-ఫిష్ శాండ్‌విచ్‌లు తినే ఆయన తీసుకునే ఆహారంలో కేలరీల విలువ దాదాపు 2400 వరకు ఉంటుంది. అయినప్పటికీ ఆయన కూరగాయలకు, ఆరోగ్యకరమైన సలాడ్లకు పూర్తిగా దూరంగా ఉంటారు.

వర్కౌట్లు లేకుండానే ఎనర్జిటిక్‌గా ఉండే వైనం

డొనాల్డ్ ట్రంప్ స్వీట్లు మరియు ఐస్‌క్రీమ్‌లను కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా ఇతర అతిథులతో పోలిస్తే ఆయనకు రెండు స్కూపాల ఐస్‌క్రీమ్ అదనంగా ఇవ్వడం విశేషం. అయితే ఇన్ని అనారోగ్యకరమైన అలవాట్లు ఉన్నప్పటికీ, ఆయన సిగరెట్లు, పొగాకు, ఆల్కహాల్, కాఫీ వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉంటారు. రాత్రిపూట కేవలం 4 నుంచి 5 గంటలు మాత్రమే నిద్రపోతూ, ఎలాంటి కఠినమైన వర్కౌట్లు చేయకుండానే తన దృఢ సంకల్పంతో ఎనర్జిటిక్‌గా ఉంటానని ఆయన చెబుతుంటారు. ఏదేమైనా ఆయన ఫాస్ట్ ఫుడ్ డైట్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ చర్చనీయాంశంగానే మారుతుంటుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.