Congo: కాంగోలో ఘోర విమాన ప్రమాదం - సీనియర్ సైనిక అధికారులతో సహా 14 మంది మృతి!

Congo: డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర విమాన ప్రమాదం. సాంకేతిక లోపంతో నివాస ప్రాంతంలో కూలిన విమానం. ఇద్దరు జనరల్స్‌తో సహా 14 మంది దుర్మరణం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 Sept 2026 10:16 AM IST
Congo
X

Congo: కాంగోలో ఘోర విమాన ప్రమాదం - సీనియర్ సైనిక అధికారులతో సహా 14 మంది మృతి!

Congo: కాంగోలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. కిక్విట్‌ నుంచి కిన్షానాకు ఒక విమానం బయలుదేరింది. కొంత దూరం ప్రయాణించిన తర్వాత విమానంలో సాంకేతిక సమస్య రావడంతో కేంజ్‌ ప్రాంతంలో కూలింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. ఈ మృతుల్లో సీనియర్ సైనిక అధికారులు ఉన్నట్లు సమాచారం.

కేంజ్‌లో ల్యాండింగ్ స్ట్రిప్ అందుబాటులో లేకపోవడంతో, విమానం నివాస స్థలంలో కూప్పకూలిందని ఉప గవర్నర్ రెమీ సాకీ బోకిండా తెలిపారు. విమానంలో ఉన్న అందరూ మరణించారని12 మంది గుర్తించలేని విధంగా కాలిపోయారని తెలిపారు. అయితే, పైలట్ మృతదేహం విమానానికి బయట కనుగొన్నామన్నారు.

ఈ ప్రమాదంలో మరణించిన వారిలో సివిలియన్లు, అధికారిక ప్రతినిధుల బృందం, వీరిలో ఇద్దరు జనరలతో పాటు ఇతర సైనిక సిబ్బంది ఉన్నారని తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్