Earthquake: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ!

Earthquake: న్యూజిలాండ్‌లోని దక్షిణ ద్వీపంలో గురువారం భారీ భూకంపం సంభవించింది.

Arun Chilukuri
Published on: 16 July 2026 4:52 PM IST
Earthquake
X

Earthquake: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ!

Earthquake: న్యూజిలాండ్‌లో గురువారం భారీ భూకంపం సంభవించింది. దేశంలోని దక్షిణ ద్వీపంలో (South Island) భూమి ఒక్కసారిగా కంపించింది. రిక్టర్‌ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 6.3గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో అధికారులు వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తక్షణమే అప్రమత్తమై, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అత్యవసర ఆదేశాలు జారీ చేశారు.

ప్రముఖ పర్యాటక కేంద్రమైన 'టె అనావ్‌' పట్టణానికి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో, భూ అంతర్భాగంలో 50 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు న్యూజిలాండ్‌ నేషనల్‌ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ (NEMA) అధికారికంగా ప్రకటించింది.

భూకంపం సంభవించిన సమయంలో కొన్ని సెకన్ల పాటు భవనాలు, ఇళ్లు తీవ్రంగా ఊగిపోయాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. భూకంపం కారణంగా జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని, సహాయక చర్యలు ముమ్మరం చేశామని స్థానిక అధికారులు పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story