Egypt: ఈజిప్టులో సంచలనం డ్రగ్స్ కేసులో టీవీ యాంకర్‌తో సహా 12 మందికి మరణశిక్ష!
Egypt: ఈజిప్టు రాజధాని కైరో కోర్టు డ్రగ్స్ కేసులో కీలక తీర్పు ఇచ్చింది. క్రైమ్ షో యాంకర్ సారా ఖలీఫా సహా 12 మందికి మరణశిక్ష విధించింది.
Egypt: ఈజిప్టులో సంచలనం డ్రగ్స్ కేసులో టీవీ యాంకర్‌తో సహా 12 మందికి మరణశిక్ష!
Egypt: ఈజిప్టులో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో కైరో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో టీవీ ప్రజెంటర్‌తో సహా 12 మందికి కోర్టు మరణ శిక్ష విధించింది. మరో 9 మందికి జీవిత ఖైదు విధించగా.. ఏడుగురిని విడుదల చేసింది. ఈ గ్యాంగ్ ముడి పదార్థాలను దిగుమతి చేసుకుని డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు పోలీసులు అభియోగాలను మోపారు.
దీనిపై లోతుగా దర్యాప్తు చేపట్టిన అధికారులు నిందితుల దగ్గర అక్రమ ఆయుధాలు ఉన్నట్లు గుర్తించారు. మరణ శిక్షకు గురైన వారిలో 'మిషన్ ఇంపాజిబుల్' అనే క్రైమ్ షో ద్వారా గుర్తింపు పొందిన ప్రముఖ టీవీ యాంకర్ సారా ఖలీఫా కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Next Story




