"నా స్పేస్ లేజర్లు పనిచేయలేదు".. అమెరికా ఎన్నికల ఫలితాలపై ఎలోన్ మస్క్ సెటైర్లు!

Elon Musk: తమ విలక్షణమైన వ్యాఖ్యలతో నిరంతరం వార్తల్లో నిలిచే ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్.. తాజాగా ముగిసిన అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలపై తనదైన శైలిలో స్పందించారు.

G Krishna
Published on: 4 Nov 2026 4:50 PM IST
Elon Musk
X

"నా స్పేస్ లేజర్లు పనిచేయలేదు".. అమెరికా ఎన్నికల ఫలితాలపై ఎలోన్ మస్క్ సెటైర్లు

Elon Musk: తమ విలక్షణమైన వ్యాఖ్యలతో నిరంతరం వార్తల్లో నిలిచే ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్.. తాజాగా ముగిసిన అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలపై తనదైన శైలిలో స్పందించారు. ఈ ఎన్నికల్లో డెమొక్రాట్లు సాధించిన భారీ విజయంపై ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్ వేదికగా ఫన్నీ పోస్టులు చేశారు. తాను ఎంత ప్రయత్నించినా డెమొక్రాట్ల విజయాన్ని అడ్డుకోలేకపోయాననే ఉద్దేశంతో ఫన్నీగా కామెంట్లు పెడుతూ నెటిజన్లను ఆకట్టుకున్నారు.

"స్పేస్ లేజర్లు ఫెయిల్ అయ్యాయి".. మస్క్ వ్యంగ్యాస్త్రాలు

ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం మస్క్ ఎక్స్ లో స్పందిస్తూ.. "ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి నేను ప్రయోగించిన 'స్పేస్ లేజర్లు' ఆశించిన ఫలితాన్ని ఇవ్వడంలో విఫలమయ్యాయి" అని జోక్ చేశారు. అంతటితో ఆగకుండా మరొక పోస్టులో.. "ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అంతరిక్షంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేయడం ఎంతో ఆకర్షణీయంగా అనిపిస్తోంది" అని సరదాగా రాసుకొచ్చారు.

టెక్సాస్ నుంచి కొత్తగా ఎన్నికైన డెమొక్రాట్ సీనేటర్ జేమ్స్ టాలారికో.. ఎలోన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌లను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసిన నేపథ్యంలో మస్క్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఎంత డబ్బు ఖర్చు చేసినా గెలిచాం: జేమ్స్ టాలారికో

ఆస్టిన్‌లో సాధించిన విజయంపై డెమొక్రాట్ నాయకుడు జేమ్స్ టాలారికో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో తమను చాలా బలహీనులుగా భావించారని అన్నారు.

"అమెరికా సీనెట్ ప్రచార చరిత్రలోనే అత్యధికంగా 300 మిలియన్ డాలర్లకు పైగా భారీ బడ్జెట్‌తో మమ్మల్ని ఎదుర్కొన్నారు. డబ్బుతో కొనుగోలు చేయగలిగిన అన్ని రకాల ప్రతికూల ప్రకటనలు, దుష్ప్రచారాలు, విదేశీ బోట్లు, ఏఐ డీప్‌ఫేక్‌లను మేము సమర్థవంతంగా ఎదుర్కొని విజయం సాధించాం" అని మస్క్ బలాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించారు.

రిపబ్లికన్ల కోటలో డెమొక్రాట్ల జెండా

టెక్సాస్ రాష్ట్రం సాంప్రదాయకంగా రిపబ్లికన్ పార్టీకి బలమైన కోటగా భావిస్తారు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత అక్కడ ఊహించని రీతిలో డెమొక్రాట్లు ఘన విజయం సాధించడం గమనార్హం. అమెరికన్ మీడియా అంచనాల ప్రకారం.. డెమొక్రాట్లు 'హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్' , 'సీనెట్' రెండింటిలోనూ తిరిగి ఆధిపత్యాన్ని సాధించారు. ఇది వాషింగ్టన్ రాజకీయాల్లో ఒక పెద్ద అధికార మార్పిడికి సంకేతంగా నిలుస్తోంది.

రిపబ్లికన్లకు మస్క్ భారీ ఆర్థిక సాయం

ఎన్‌బీసీ న్యూస్ కథనం ప్రకారం.. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థులకు ఎలోన్ మస్క్ అతిపెద్ద ఆర్థిక మద్దతుదారుగా నిలిచారు. పార్టీ కాంగ్రెషనల్ ప్రచారాల కోసం ఆయన ఏకంగా 250 మిలియన్ డాలర్లు (సుమారు ₹2,000 కోట్లకు పైగా) ఖర్చు చేశారు. అయితే ఈ ఫలితాల తర్వాత టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) భవిష్యత్తుపై అనిశ్చితి పెరుగుతున్న తరుణంలో మస్క్ చేసిన ఈ సరదా వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.