Flydubai : ఫ్లైదుబాయ్ ఘటనలో కెప్టెన్ ప్రాణాలు కాపాడిన ప్యాసెంజర్..!
Flydubai : ఫ్లైదుబాయ్ ఫ్లైట్‌లో అనుకోకుండా జరిగిన ఒక షాకింగ్ ఇన్సిడెంట్ ఇప్పుడు అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. FZ1073 ఫ్లైట్‌లో నార్మల్ ప్యాసెంజర్‌గా ట్రావెల్..
Flydubai FZ1073
Flydubai : ఫ్లైదుబాయ్ ఫ్లైట్‌లో అనుకోకుండా జరిగిన ఒక షాకింగ్ ఇన్సిడెంట్ ఇప్పుడు అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. FZ1073 ఫ్లైట్‌లో నార్మల్ ప్యాసెంజర్‌గా ట్రావెల్ చేస్తున్న ఇజ్రాయెల్ డెంటిస్ట్ షోటా ముసయేవ్, కాక్‌పిట్‌లో జరిగిన ఒక ఎమర్జెన్సీ సిట్యువేషన్‌లో రియల్ హీరోగా మారి ఫ్లైట్ కెప్టెన్ లైఫ్‌ను సేవ్ చేశారు. టెల్ అవీవ్ వెళ్తున్న ఈ ఫ్లైట్ మిడ్-ఎయిర్‌లో ఉన్నప్పుడు కాక్‌పిట్‌లో విపరీతమైన గొడవ జరిగింది. కో-పైలట్ హమామ్ అల్-హమ్మామి సడన్‌గా ఎమర్జెన్సీ క్రాష్ గొడ్డలి తీసుకుని, ఇండియన్ పైలట్ స్మిత్ మచ్చార్‌పై వైలెంట్‌గా ఎటాక్ చేశాడు. ఈ ఊహించని దాడిలో కెప్టెన్ స్మిత్ హెడ్ తీవ్రంగా డ్యామేజ్ అవ్వడమే కాకుండా, హ్యాండ్స్ , నెక్ పైన సీరియస్ గాయాలయ్యాయి. కాక్‌పిట్ నుంచి అరుపులు వినపడటంతో ఫ్లైట్‌లో ఉన్న ఏకైక డాక్టర్ అయిన డెంటిస్ట్ ముసయేవ్ వెంటనే స్పాట్‌కు పరిగెత్తారు. అక్కడ ఉన్న క్రూ మెంబర్స్‌తో కలిసి ముందుగా ఆ సైకోలా ప్రవర్తించిన కో-పైలట్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంట్రోల్ చేసి పక్కకు లాగేశారు.
45 మినిట్స్ మెడికల్ స్ట్రగుల్.. హ్యాండిల్ చేసిన డెంటిస్ట్
దాడి చేసిన కో-పైలట్‌ను బంధించిన వెంటనే, రక్తం మడుగులో ఉన్న కెప్టెన్ స్మిత్‌కు ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు డెంటిస్ట్. స్మిత్ తల, లెఫ్ట్ హ్యాండ్ నుంచి బ్లీడింగ్ విపరీతంగా అవుతుండటంతో టీ-షర్ట్‌తో ప్రెజర్ పెట్టి ఆపే ప్రయత్నం చేశారు. గాయాలు చాలా డీప్‌గా ఉండటంతో బ్లీడింగ్ కంట్రోల్ అవ్వలేదు. దీంతో వెంటనే ఐస్ ప్యాక్స్ ఉపయోగించి కంటిన్యూస్‌గా 45 మినిట్స్ పాటు ప్రెజర్ మెయింటెన్ చేస్తూ బ్లీడింగ్‌ను అదుపులోకి తెచ్చారు. మధ్యలో స్మిత్ పల్స్ పడిపోవడం, పెదవులు బ్లూ కలర్‌లోకి మారడం గమనించిన ముసయేవ్, వెంటనే అతని కాళ్లను పైకి లేపి బ్రెయిన్‌కు బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేలా చేశారు. స్మిత్ అన్ కాన్షియస్ అవ్వకుండా ఉండటానికి అతని ఫ్యామిలీ, కిడ్స్ గురించి కంటిన్యూస్‌గా మాట్లాడుతూ కాన్ఫిడెన్స్ నింపారు.
సౌదీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
కెప్టెన్ స్మిత్ పెయిన్ తట్టుకోలేక మెడిసిన్స్ అడిగినప్పటికీ, హెవీ బ్లీడింగ్ ఉన్నప్పుడు మెడిసిన్స్ ఇవ్వడం డేంజర్ అని చెప్పి కేవలం కొద్దిగా వాటర్ మాత్రమే ఇచ్చారు. ఫ్లైట్‌ను వీలైనంత ఫాస్ట్‌గా ల్యాండ్ చేయాలని క్రూకు ఇన్ఫార్మ్ చేశారు. ఎటాక్ జరిగిన 40 మినిట్స్ తర్వాత ఫ్లైట్‌ను సౌదీ అరేబియాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ల్యాండ్ అవ్వగానే స్మిత్‌ను అక్కడ ఉన్న మెడికల్ టీమ్‌కు హ్యాండోవర్ చేశారు. ప్యాసెంజర్స్ అందరినీ సేఫ్‌గా ల్యాండ్ చేసిన కెప్టెన్ స్మిత్ రియల్ హీరో అని, ఆయన అందరి ప్రాణాలు కాపాడితే, తాను ఆయన ప్రాణాలు కాపాడగలిగానని డెంటిస్ట్ ముసయేవ్ ఎమోషనల్‌గా చెప్పారు.




