Nirmala Sitharaman: అమెరికాలో జీ20 ఆర్థిక మంత్రుల భేటీ.. ఇరాన్ ఆంక్షలు, ఇంధన భద్రతపై భారత్ కీలక వాదనలు!
Nirmala Sitharaman: అమెరికాలోని ఆష్‌విల్‌లో జరుగుతున్న జీ20 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొంటున్నారు.
Nirmala Sitharaman: అమెరికాలో జీ20 ఆర్థిక మంత్రుల భేటీ.. ఇరాన్ ఆంక్షలు, ఇంధన భద్రతపై భారత్ కీలక వాదనలు!
Nirmala Sitharaman: అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, ఆష్‌విల్ లో నిర్వహిస్తున్న జీ20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం ప్రారంభమైంది. ఈ సదస్సులో భారత్ తరఫున పాల్గొంటున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు కీలక అంశాలను అంతర్జాతీయ వేదికపై లేవనెత్తనున్నారు. ముఖ్యంగా ఇరాన్‌పై అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షలు, ఇంధన భద్రత మరియు వాణిజ్య ఉద్రిక్తతలపై ఆమె ప్రధానంగా దృష్టి సారించనున్నారు.
ఈ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా చేరుకున్న నిర్మలా సీతారామన్‌కు సౌత్ కరోలినాలోని గ్రీన్‌విల్-స్పార్టన్‌బర్గ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా సాదర స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు జరిగే ఈ భేటీకి అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఆతిథ్యమిస్తున్నారు.
ఇరాన్ సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన భద్రతకు వాటిల్లే ముప్పుపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముడి చమురు, సహజవాయువు ధరలు పెరిగితే అది భారత దిగుమతి వ్యయాన్ని పెంచడంతో పాటు దేశీయంగా ద్రవ్యోల్బణం, రూపాయి విలువపై తీవ్ర ప్రభావం చూపుతుందని భారత్ ఈ వేదికగా గట్టిగా ప్రస్తావించనుంది.
చౌకగా లభించే చైనా ఉత్పత్తుల కారణంగా దేశీయ పరిశ్రమలకు జరుగుతున్న నష్టాన్ని ఎత్తిచూపుతూనే, కొన్ని దేశాలు విధిస్తున్న ఏకపక్ష సుంకాల విధానాన్ని భారత్ వ్యతిరేకించనుంది.
అంతర్జాతీయ సంస్థలకు భారత్‌ను అత్యంత ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయ ఉత్పాదక మరియు పెట్టుబడుల కేంద్రంగా ప్రమోట్ చేసేందుకు నిర్మలా సీతారామన్ ఈ వేదికను పూర్తిగా వినియోగించుకోనున్నారు. రాబోయే డిసెంబర్‌లో మయామిలో జరగనున్న జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశానికి ఈ భేటీ కీలక సన్నాహక వేదికగా నిలవనుంది.




