Gautam Adani: అమెరికా కోర్టులో అదానీ కేసు క్లైమాక్స్.. రహస్య ఒప్పందాలు నిజమేనా?
Gautam Adani: అమెరికా కోర్టులో అదానీ క్రిమినల్ కేసు ముగింపు దశకు చేరింది.
Gautam Adani: అమెరికా కోర్టులో అదానీ కేసు క్లైమాక్స్.. రహస్య ఒప్పందాలు నిజమేనా?
Adani US Case: వ్యాపార సామ్రాజ్యంలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, మరోసారి అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచారు. అమెరికా కోర్టులో ఆయనపై ఉన్న హై-ప్రొఫైల్ క్రిమినల్ కేసు ఇప్పుడు అత్యంత కీలకమైన మలుపు తిరిగింది. తనపై ఉన్న లీగల్ వివాదాలు ముగిసిపోతున్నాయనుకున్న తరుణంలో.. అమెరికా కోర్టు విధించిన ఒక గడువు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
ఈ వారంలోనే గౌతమ్ అదానీ అమెరికా న్యాయస్థానంలో ఒక అత్యంత కీలకమైన ప్రమాణ పత్రాన్ని సమర్పించబోతున్నారు. గౌతమ్ అదానీపై ఉన్న క్రిమినల్ అభియోగపత్రాన్ని శాశ్వతంగా కొట్టివేయాలని అమెరికా న్యాయశాఖే స్వయంగా కోర్టును అభ్యర్థించింది. ఇది అదానీకి పెద్ద ఊరట ఇచ్చే విషయమే అయినప్పటికీ, అమెరికా కోర్టు న్యాయమూర్తి ఇక్కడే ఒక పెను నిబంధన పెట్టారు.
కేసు ఉపసంహరణ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందా లేదా అని నిర్ధారించుకోవడానికి న్యాయస్థానం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగానే ఈనెల 15వ తేదీ లోపు గౌతమ్ అదానీ స్వయంగా కోర్టుకు అఫిడవిట్ సమర్పించాలని గడువు విధించింది. అమెరికా జడ్జి ఆదేశాల ప్రకారం.. అదానీ సమర్పించబోయే ప్రమాణ పత్రంలో ముఖ్యంగా రెండు కీలక ప్రశ్నలకు సమాధానాలు ఉండాలి.
కేసును ఉపసంహరించుకోవడానికి బదులుగా.. అమెరికా ప్రభుత్వంతో వెనుక సీటులోఎలాంటి వాగ్దానాలు, ప్రతిపాదనలు లేదా రహస్య ఒప్పందాలు జరగలేదని అదానీ స్పష్టం చేయాల్సి ఉంటుంది. ఈ కేసును కొట్టివేయడం ద్వారా అమెరికా ప్రభుత్వానికి లేదా మరెవరికైనా ఏదైనా ప్రత్యక్ష లేదా పరోక్ష లబ్ధి చేకూర్చేలా వ్యవహారాలు జరిగాయా? ఆ విషయాలు ఆయనకు తెలుసా? అనేది కూడా అందులో పేర్కొనాలి.
వ్యాపార ప్రపంచాన్ని ఉత్కంఠకు గురిచేస్తున్న ఈ కేసులో ఈనెల 15వ తేదీ అత్యంత కీలకం కానుంది. గౌతమ్ అదానీ సమర్పించబోయే ఈ ప్రమాణ పత్రం ఆధారంగానే, అమెరికా కోర్టు ఈ భారీ క్రిమినల్ కేసును పూర్తిగా కొట్టివేయాలా లేదా అనేదానిపై తన తుది తీర్పును వెలువరించనుంది.
అంతర్జాతీయంగా అదానీ గ్రూప్ ఇమేజ్‌ను, వ్యాపార విస్తరణను ప్రభావితం చేసే ఈ లీగల్ యుద్ధంలో అదానీ విజయం సాధిస్తారా? అమెరికా న్యాయశాఖ వేసిన అడుగుతో ఈ వివాదానికి శాశ్వతంగా తెరపడుతుందా? అనేది మరో కొన్ని రోజుల్లో తేలిపోనుంది.




