Venezuela crude oil supply to India: గుడ్‌న్యూస్...వెనుజులా నుంచి భారత్‌కు చమురు.. కష్టాలు తీరినట్టే
Venezuela crude oil supply to India: అంతర్జాతీయంగా ఇంధన మార్కెట్ ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో భారత్‌కు ఓ శుభవార్త అందింది.
Venezuela crude oil supply to India: గుడ్‌న్యూస్...వెనుజులా నుంచి భారత్‌కు చమురు.. కష్టాలు తీరినట్టే
Venezuela oil India: అంతర్జాతీయంగా ఇంధన మార్కెట్ ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో భారత్‌కు ఓ శుభవార్త అందింది. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల చమురు సరఫరాకు ఆటంకాలు కలుగుతున్న వేళ, ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న వెనిజులా నుంచి భారత్‌కు చమురు దిగుమతులు పునఃప్రారంభమయ్యాయి. సుమారు 1.2 కోట్ల బ్యారెళ్ల ముడి చమురును వెనిజులా నుంచి భారత్ సేకరించనుండటం విశేషం.
సంక్షోభంలో ఆశాదీపం
పశ్చిమాసియాలో యుద్ధవాతావరణం, ఇరాన్ కీలకమైన హోర్ముజ్ జలసంధి దిగ్బంధనంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు సరఫరా నిలిచిపోయింది. దీంతో భారత ప్రధాని మోదీ నేతృత్వంతోని భారత ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించింది. గతంలో నిలిచిపోయినా సరఫరాను తిరిగి వెనుజులా నుంచి పునరుద్దరించాలని భావించింది. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం, వెనిజులా నుంచి బయలుదేరిన చమురు నౌకలు త్వరలోనే భారత తీరానికి చేరుకోనున్నాయి.
భారత్ వ్యూహం: 45 దేశాల నుంచి దిగుమతి
గతంలో చమురు కోసం కేవలం అరబ్ దేశాలపైనే ఆధారపడే భారత్, ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చింది. ఇంధన భద్రతను కాపాడుకునేందుకు ఏకంగా 45 దేశాల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల ఒక దేశంలో సమస్య తలెత్తినా దేశీయంగా ఇంధన కొరత రాకుండా జాగ్రత్త పడుతోంది. వెనిజులాలో ప్రస్తుతం అమెరికా పర్యవేక్షణలో చమురు ఉత్పత్తి జరుగుతుండటంతో, అక్కడి నుంచి దిగుమతులకు మార్గం సుగమమైంది.
సామాన్యుడికి కలిగే లాభం ఏంటి?
ఏ దేశానికైనా చమురు చాలా కీలకం. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగితే దాని నుంచి ఉత్పత్తి అయ్యే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా అమాంతం పెరుగుతాయి. అయితే, వెనుజులా, రష్యా నుంచి తక్కువ ధరకు చమురు లభించడం వలన భారత్‌పై ఆర్థిక భారం కొంతమేర తగ్గుతుంది. ఫలితంగా ధరలు స్థిరంగా ఉంటాయి. అయితే, రష్యా, గల్ఫ్ దేశాల నుంచి వచ్చే ముడి చమురు కంటే వెనుజులా నుంచి వచ్చే చమురు నాణ్యత కొంత భిన్నంగా ఉంటుంది. అయినప్పటికీ భారతీయ రిఫైనరీలు భారీ రకమైన చమురును కూడా శుద్ది చేయడంలో మేటిగా గుర్తింపు పొందాయి. భారీ రకం చమురును భారత్ రిఫైనరీలు శుద్ది చేసి ఎగుమతి కూడా చేస్తున్నాయి.
ఒకే దేశంపై ఆధారపడకుండా వివిధ దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకోవడంతో భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇది సామాన్యుడికి కొంత ఊరటనిచ్చే అంశం. 1.2 కోట్ల బ్యారెళ్ల చమురు మన దేశానికి చేరితే చాలా వరకు చమురు సమస్య తగ్గుతుంది.




