Nepal Floods: నేపాల్‌లో ఉప్పొంగుతున్న నదులు.. మరోసారి తీవ్ర వరద ముప్పు!

Nepal Floods: నేపాల్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రధాన నదులు ఉప్పొంగుతున్నాయి.

Arun Chilukuri
Published on: 2 Sept 2026 2:07 PM IST
Nepal Floods
X

Nepal Floods: నేపాల్‌లో ఉప్పొంగుతున్న నదులు.. మరోసారి తీవ్ర వరద ముప్పు!

Nepal Floods: హిమాలయ దేశం నేపాల్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. దేశవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో పలు ప్రధాన నదులు ఉధృతంగా ప్రవహిస్తూ ప్రమాదకర స్థాయికి చేరువయ్యాయి. ఈ నేపథ్యంలో మధ్య, పశ్చిమ, తూర్పు ప్రాంతాల ప్రజలకు అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

సింధూలి జిల్లాలోని సన్ కోశీ నది, గూర్ఖా జిల్లాలోని బుధి గండకి నది, దడెల్ధురా జిల్లాలోని మహాకాళి నదుల్లో నీటిమట్టాలు హెచ్చరిక స్థాయిని దాటాయి.

లమ్‌జంగ్ జిల్లాలోని మర్స్యంగ్ది నదిలో ప్రవాహం ఇప్పటికే ప్రమాద స్థాయిని దాటిందని, నీటిమట్టం ఇంకా పెరుగుతూనే ఉందని ఫ్లడ్ ఫోర్‌కాస్టింగ్ డివిజన్ ఆందోళన వ్యక్తం చేసింది.

నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDRRMA) నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు వెంటనే అప్రమత్తం కావాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story