Imran Khan: ఇమ్రాన్‌ ఖాన్‌కు బిగ్ రిలీఫ్.. వెంటనే ఆస్పత్రికి తరలించాలని కోర్టు ఆదేశం!

Imran Khan: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశం.

Arun Chilukuri
Published on: 18 Aug 2026 3:14 PM IST
Imran Khan
X

Imran Khan: ఇమ్రాన్‌ ఖాన్‌కు బిగ్ రిలీఫ్.. వెంటనే ఆస్పత్రికి తరలించాలని కోర్టు ఆదేశం!

Imran Khan: జైలులో ఉన్న పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ (PTI) అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌కు అక్కడి అత్యున్నత న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. ఆయన ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుండటంతో, వెంటనే తగిన వైద్య సహాయం కోసం ఆస్పత్రికి తరలించాలని న్యాయస్థానం ప్రభుత్వ అధికారులను ఆదేశించింది. ఆయన వైద్య నివేదికలను ఆధారంగా చేసుకుని కుటుంబ సభ్యులు, పీటీఐ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కోర్టు ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

న్యాయస్థానం ఆదేశాలను పీటీఐ అధికార ప్రతినిధి జుల్ఫికర్ బుఖారీ స్వాగతించారు. ఈ చర్యలు ముందే తీసుకుని ఉంటే ఆయన ఆరోగ్యం ఇంతగా క్షీణించి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. ఇమ్రాన్‌ పూర్తిగా కోలుకునే వరకు ప్రైవేట్ వైద్యుల సంరక్షణలోనే ఉంచాలని కోర్టును కోరారు.

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ స్పందిస్తూ, ఇమ్రాన్ వైద్య నివేదికలను నిపుణులతో కలిసి పరిశీలించినట్లు తెలిపారు. మూడేళ్ల జైలు జీవితం, ఏకాంతం వల్ల ఆయన తీవ్ర ఒత్తిడి, మానసిక, శారీరక సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గత ఏడు నెలలుగా బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకపోవడం వల్లే ఆయన కుంగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇమ్రాన్‌ ఖాన్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ పీటీఐ కార్యకర్తలు, మద్దతుదారులు పాకిస్థాన్‌ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు.

తోషాఖానా, అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసులతో పాటు పలు ఇతర కేసుల్లో శిక్షపడిన ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రస్తుతం రావల్పిండిలోని ప్రసిద్ధ ఆడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story