Imran Khan: జైలులో ఇమ్రాన్ ఖాన్.. 9 నెలల తర్వాత భార్య బుష్రా బీబీ, సోదరితో భేటీ!

Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ 9 నెలల తర్వాత జైలులో భార్య బుష్రా బీబీని కలిశారు. ఆయనను ఆసుపత్రికి తరలించాలని పాక్ సుప్రీంకోర్టు ఆదేశించింది.

Arun Chilukuri
Published on: 19 Aug 2026 2:59 PM IST
Imran Khan
X

Imran Khan: జైలులో ఇమ్రాన్ ఖాన్.. 9 నెలల తర్వాత భార్య బుష్రా బీబీ, సోదరితో భేటీ!

Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ దాదాపు 9 నెలల విరామం తర్వాత జైలులో తన కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆడియాలా జైలులో ఉన్న ఇమ్రాన్‌తో ఆయన సతీమణి బుష్రా బీబీ, సోదరి నొరీన్ భేటీ అయ్యారు.

జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ను ఆయన కుటుంబ సభ్యులు వారానికి ఒకసారి కలిసేందుకు వీలు కల్పించాలని పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఇటీవల ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలోనే ఆడియాలా జైలు అధికారులు ఈ భేటీకి ఏర్పాట్లు చేశారు.

తోషాఖానా, అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం క్షీణిస్తోందన్న వార్తల నేపథ్యంలో.. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు మంగళవారం అధికారులను ఆదేశించింది.

గత కొన్ని నెలలుగా ఇమ్రాన్‌ను ఎవరినీ కలవనివ్వకపోవడంతో ఆయన ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఏకాంత జైలు శిక్ష కారణంగా ఆయన తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడికి లోనవుతున్నారని, ఆయన ఆరోగ్యం దెబ్బతింటోందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయనను ఆసుపత్రికి తరలించేందుకు కావాల్సిన చట్టపరమైన ప్రక్రియను అధికారులు చేపడుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story