అమెరికా సుంకాల మెలిక.. భారత్ ముందున్న రెండు ఆప్షన్లు!
India US Trade Deal: అమెరికా కొత్త సుంకాల ప్రతిపాదనలు భారత్-అమెరికా వాణిజ్య సంబంధాల్లో గందరగోళాన్నిపెంచాయి.
అమెరికా సుంకాల మెలిక.. భారత్ ముందున్న రెండు ఆప్షన్లు!
India US Trade Deal: అమెరికా కొత్త సుంకాల ప్రతిపాదనలు భారత్-అమెరికా వాణిజ్య సంబంధాల్లో గందరగోళాన్ని పెంచాయి. వాణిజ్య ఒప్పందం కుదిరితే భారత దిగుమతులపై 17 శాతం సుంకం విధిస్తామని, ఒప్పందం కుదరకపోతే అది 25 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం సూచించింది.
భారత్ పారిశ్రామిక విధానాల వల్ల నిర్మాణాత్మక అదనపు సామర్థ్యం ఏర్పడుతోందని, తద్వారా అమెరికా సంస్థలకు అవకాశాలు తగ్గుతున్నాయని వాషింగ్టన్ ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది.
అదనపు సామర్థ్యం వాదనను కొట్టిపారేసిన భారత్
భారత్‌లోని ఏ రంగంలోనూ అటువంటి నిర్మాణాత్మక అదనపు సామర్థ్యం లేదని వాణిజ్య శాఖ స్పష్టం చేసింది. దర్యాప్తు ప్రక్రియలో భారత్ నిర్మాణాత్మకంగానే వ్యవహరించిందని, తమ వైఖరిని మొదట్నుంచీ తెలియజేస్తూనే ఉన్నామని పేర్కొంది. ద్వైపాక్షిక చర్చల ఫ్రేమ్‌వర్క్ ద్వారానే వాణిజ్యపరమైన అంశాలను పరిష్కరించుకోవాలనే అభిప్రాయంతో భారత్ ఉన్నట్లు తెలుస్తోంది.
సుంకాల ఉపశమనం, మార్కెట్ యాక్సెస్ చర్చలపై ఒత్తిడి
సుంకాల తగ్గింపు, మార్కెట్ యాక్సెస్‌పై కొనసాగుతున్న చర్చలపై ఈ కొత్త ప్రతిపాదనలు అదనపు ఒత్తిడిని తీసుకువచ్చాయి. ఒకవైపు చర్చలను ముందుకు తీసుకెళ్తూనే, మరోవైపు మారుతున్న వాణిజ్య పరిస్థితులకు అనుగుణంగా భారత్ సిద్ధమవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎగుమతుల పరంగా ప్రత్యామ్నాయ మార్గాలు, మార్కెట్ల వైవిధ్యీకరణపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
భారత్ ముందున్న సవాళ్లు.. వ్యూహాత్మక అడుగులు
అమెరికా వైఖరితో ఎగుమతి రంగాలపై పడే ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి రక్షణ చర్యలు చేపట్టడం కీలకంగా మారింది. చర్చల్లో దేశ ప్రయోజనాలు, పరిశ్రమల రక్షణను కాపాడుకుంటూనే, వాణిజ్య భాగస్వామ్యాలను విస్తరించుకోవడం ద్వారా ఈ సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాల్సిన తరుణం ఆసన్నమైంది.




