Captain Smit Machchhar: తీవ్ర గాయాలైనా వందలాది మందిని రక్షించిన కెప్టెన్ స్మిత్ మచ్చర్.. మోదీ, ట్రంప్ ప్రశంసలు!
Captain Smit Machchhar: ప్రాణాంతక దాడి జరిగినా ప్రాణాలకు తెగించి వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై ప్రశంసల వెల్లువ.
Captain Smit Machchhar: తీవ్ర గాయాలైనా వందలాది మందిని రక్షించిన కెప్టెన్ స్మిత్ మచ్చర్.. మోదీ, ట్రంప్ ప్రశంసలు!
Captain Smit Machchhar: ప్రయాణంలో ఊహించని ప్రమాదం ఎదురైనా, తన ప్రాణాలను లెక్కచేయకుండా వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగానూ ప్రశంసలు అందుకుంటున్నారు. తీవ్రంగా గాయపడినప్పటికీ ఆయన ప్రదర్శించిన అద్భుతమైన ధైర్యసాహసాలు, సమయస్ఫూర్తి పెను విషాదాన్ని అడ్డుకున్నాయని ప్రపంచ నేతలు కొనియాడారు.
తీవ్ర గాయాలపాలైనప్పటికీ ఇతరుల ప్రాణాలను రక్షించేందుకు కెప్టెన్ స్మిత్ మచ్చర్ చూపిన తెగువ ప్రయాణికుల ప్రాణాలను కాపాడిందని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా కొనియాడారు. మచ్చర్‌ను చూసి భారత్ గర్విస్తోందని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
స్మిత్ మచ్చర్‌ను 'హీరో'గా అభివర్ణించిన ట్రంప్, ఆయన సమయస్ఫూర్తిని ప్రశంసించారు. తీవ్ర రక్తస్రావం అవుతున్నప్పటికీ కాక్‌పిట్ తలుపు తెరిచి సహాయం కోరడం వల్లనే ప్రయాణికులు లోపలికి వెళ్లి పరిస్థితిని చక్కదిద్దగలిగారని తెలిపారు.
కెప్టెన్ స్మిత్ మచ్చర్ దేశానికి గర్వకారణమని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆయన ధైర్యం, దృఢ సంకల్పం భారీ ప్రాణనష్టాన్ని నివారించాయని ప్రశంసించారు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ ప్రస్తుతం సౌదీ అరేబియాలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. రియాద్, జెడ్డాలోని భారతీయ అధికారులు ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ, కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నారు.




