Helicopter Crash: అడవిలో కూలిన హెలికాప్టర్.. ఎనిమిది మంది దుర్మరణం!

Helicopter Crash: ఇండోనేసియాలో కూలిన హెలికాప్టర్. ఎనిమిది మంది ప్రయాణికులు మృతి. పశ్చిమ కాళీమంతన్ ప్రావిన్స్‌లో విషాదం. ప్రమాద కారణాలపై దర్యాప్తు.

Arun Chilukuri
Published on: 17 April 2026 10:45 AM IST
Helicopter Crash
X

Helicopter Crash: అడవిలో కూలిన హెలికాప్టర్.. ఎనిమిది మంది దుర్మరణం!

Helicopter Crash: ఇండోనేసియాలో భారీ హెలికాప్టర్ ప్రమాదం సంభవించింది. పశ్చిమ కాళీమంతన్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ ఘటనలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు విమాన సిబ్బంది కాగా, ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు.

మాథ్యూ ఎయిర్ నుసంతారాకు చెందిన 'ఎయిర్ బస్ హెచ్-130' అనే హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. గురువారం మెల్వాయ్ ప్రాంతంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) తో సంబంధాలు తెగిపోయాయి. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో సిగ్నల్స్ అందలేదు. గాలింపు చర్యలు చేపట్టిన రెస్క్యూ బృందాలు, టేకాఫ్ పాయింట్ నుండి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కొండపై హెలికాప్టర్ తోక భాగాన్ని గుర్తించాయి. హెలికాప్టర్ కుప్పకూలిన వేగానికి అందులో ఉన్న ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు నిర్ధారించారు.

కారణాలు తెలియాల్సి ఉంది..

ఈ ప్రమాదం జరిగిన ప్రాంతం ఒక పామాయిల్ కంపెనీకి చెందినదని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం సైనిక, పోలీసు మరియు సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు లేదా సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను వెలికితీసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story