Hormuz: హార్ముజ్ జలసంధిపై ఇరాన్ ఉక్కుపాదం.. ఇకపై నౌకలు టోల్ కట్టాల్సిందే!
Hormuz: హార్ముజ్ జలసంధిపై ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మార్గం గుండా వెళ్లే నౌకలపై టోల్ వసూలు చేయడంతో పాటు, అమెరికా-ఇజ్రాయెల్ నౌకల ప్రయాణంపై ఇరాన్ పార్లమెంట్ పూర్తి నిషేధం విధించింది.
Hormuz: హార్ముజ్ జలసంధిపై ఇరాన్ ఉక్కుపాదం.. ఇకపై నౌకలు టోల్ కట్టాల్సిందే!
Hormuz: హార్ముజ్ జలసంధిపై ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై టోల్ వసూలు చేసేందుకు ఇరాన్ పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం ఈ మార్గం గుండా ప్రయాణించే నౌకలు ఇరాన్ కరెన్సీ రూపంలో టోల్ చెల్లించాల్సి ఉంటుందని ఇరాన్ తెలిపింది. ఈ ప్రణాళికలో భాగంగా ఆర్థికపరమైన అంశాలే కాకుండా, జలసంధి భద్రత, పర్యావరణ పరిరక్షణ, నౌకల భద్రత బాధ్యతలను ఇరాన్ తన పరిధిలోకి తీసుకుంది.
అమెరికా-ఇజ్రాయెల్, అలాగే ఇరాన్‌పై ఏకపక్షంగా ఆంక్షలు విధించే దేశాల నౌకలు ఈ జలసంధి గుండా ప్రయాణించడాన్ని ఇరాన్ పార్లమెంట్ పూర్తిగా నిషేధించింది. ఇరాన్ సార్వభౌమాధికారాన్ని బలపరిచే విధంగా ఈ ప్రణాళిక రూపొందించబడినట్లు అధికారులు తెలిపారు.
Next Story




