Iran mathematical warning oil prices: ఇరాన్ సరికొత్త అస్త్రం...ప్రపంచానికి గణిత సందేశం
Iran mathematical warning oil prices: పశ్చిమాసియా శాంతి చర్చలు విఫలమైనవేళ హోర్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తే చమురు ధరలు కేవలం పెరగడమే కాదు...
Iran mathematical warning oil prices
Iran mathematical warning oil prices: పశ్చిమాసియా శాంతి చర్చలు విఫలమైనవేళ హోర్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తే చమురు ధరలు కేవలం పెరగడమే కాదు...నియంత్రించలేనంత వేగంతో దూసుకుపోతాయని ఓ గణిత సమీకరణం ద్వారా ఇరాన్ ప్రపంచాన్ని హెచ్చరించింది. ఎప్పుడైత చర్చలు విఫలమయ్యాయో అప్పుడే ఇరాన్ ఓడరేవులపై ట్రంప్ మరిన్ని ఆంక్షలు విధించారు. అంతేకాదు, ప్రపంచానికి జీవనాడిగా ఉన్న జలసంధిని దిగ్బంధిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ ఆసక్తికరంగా చేసిన గణిత సూత్రం అందర్ని ఆశ్చర్యపరచడమే కాదు... ఆలోచింపజేస్తుంది కూడా. సాధారణంగా దేశాల మధ్య ముద్ధం జరుగుతున్న సమయంలో రాజకీయంగా లేదా సైనికపరంగా హెచ్చరికలు చేయడం సహజం.
ఏంటీ గణిత సూత్రం
ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ బఘేర్ ఘాలిబాఫ్ ఓ అడుగు ముందుకు వేసి ప్రపంచానికి ఓ గణిత సందేశాన్ని పంపారు. ట్విట్టర్ ద్వారా బాఫ్ షేర్ చేసిన సూత్రం ΔO_BSOH>0 ⇒ f(f(O))>f(O ఇది. ఇందులో O అంటే చమురు ధరలు. ట్రయాంగిల్ గుర్తు పైకి ఉండటం అంటే ధరలు పెరుగుతాయి అని అర్ధం. BSOH అంటే హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం. ఈ సమీకరణం ప్రకారం దిగ్బంధనం పెరిగిన కొద్ది చమురు ధరలు పెరగడం మాత్రమే కాదు... ఆ పెరుగుదల మరింత వేగంగా తీవ్రంగా మారుతుంది. జలసంధి దిగ్బంధం సమయం పెరిగే కొద్ది మార్కెట్‌లో భయాందోళనలు పెరుగుతాయి. సరఫరా గొలుసులో అంతరాయాలు ఒక చైన్ రియాక్షన్‌ను సృష్టించి ధరలను ఊహించని స్థాయికి తీసుకెళ్తాయి.
అమెరికాపై ప్రభావం
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు బ్యారెల్‌కు సుమారు 80 నుంచి 90 డాలర్ల మధ్య ఉన్నది. ఇటీవల కాల్పుల విరమణ ప్రకటన తరువాత అంతర్జాతీయంగా ముడి చమురు భారీగా తగ్గుముఖం పట్టాయి. కానీ, ఈ జలసంధి ఇప్పుడు మరోమారు దిగ్బంధనం అమలైతే మరోసారి బ్యారెల్ వంద డాలర్లను చేరుతుంది. దీని ప్రభావం అమెరికాపై కూడా పడే అవకాశం ఉందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలో గ్యాలన్‌కు 3 డాలర్లు ఉండగా, త్వరలోనే అది 4 నుంచి 5 డాలర్లకు పెరిగే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరించారు. వైట్ హౌస్ సమీపంలోని పెట్రోల్ బంకుల ధరలను ఉద్దేశిస్తూ, "ప్రస్తుత తక్కువ ధరలను ఆస్వాదించండి, ఎందుకంటే త్వరలోనే ఈ అంకెలు మారిపోనున్నాయి" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేస్తున్నాయి.
ఆందోళనకు కారణమేంటి?
ప్రపంచ వ్యాప్తంగా ఈ జలసంధి గుండా సుమారు 20 నుంచి 30 శాతం వరకు చమురు రవాణా జరుగుతుంది. ఒకవేళ అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ జలసంధిని దిగ్బంధిస్తే ఆసియా దేశాలతో పాటు అటు యూరప్ దేశాలకు చమురు రవాణా తగ్గిపోతుంది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురును దిగుమతి చేసుకోవలసి వస్తుంది. చమురుకు డిమాండ్ పెరిగితే... బ్యారెల్ ధరలు 100 డాలర్లకు చేరుకుంటుంది. అంతేకాదు, చమురును తీసుకొచ్చే నౌకల భీమా ఖర్చులు కూడా భారీగా పెరుగుతాయి. నెలల తరబడి దిగ్బంధనం జరిగితే ప్రపంచవ్యాప్తంగా రవాణా రంగం కుప్పకూలి ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతుంది. ఇప్పటి వరకు మాటల వరకే పరిమితం అయిన ఇరాన్, అమెరికా గొడవలు...ఇప్పుడు గణిత శాస్త్రం ద్వారా ఇరాన్ ఇచ్చిన ఈ వార్నింగ్ అంతర్జాతీయ దౌత్యనీతిలో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. మరి ఈ గణిత సూత్రం సోషల్ మీడియా వరకే ఆగిపోతుందా... లేదంటే అందులో ఉన్న ఇరాన్ చెప్పిన విధంగానే చమురు ప్రభావం చూపుతుందా చూడాలి.




