US Iran Israel War: మధ్యవర్తిగా పాకిస్థాన్? ‘నో వే’ అంటున్న ఇజ్రాయెల్!

US Iran Israel War: ఇరాన్-అమెరికా మధ్యవర్తిత్వంపై పాకిస్థాన్‌ను ఇజ్రాయెల్ తప్పుబట్టింది.

Arun Chilukuri
Published on: 10 April 2026 12:35 PM IST
US Iran Israel War
X

US Iran Israel War: మధ్యవర్తిగా పాకిస్థాన్? ‘నో వే’ అంటున్న ఇజ్రాయెల్!

US Iran Israel War: ఇరాన్ మరియు అమెరికా మధ్య సయోధ్య కుదిర్చేందుకు సిద్ధమైన పాకిస్థాన్‌కు ఇజ్రాయెల్ గట్టి షాక్ ఇచ్చింది. పాకిస్థాన్ అంత నమ్మదగ్గ దేశం కాదంటూ ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి.

పాకిస్థాన్‌పై తమకు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకం లేదని రూవెన్ అజార్ స్పష్టం చేశారు. కేవలం తన స్వప్రయోజనాల కోసమే అమెరికా పాకిస్థాన్‌ను మధ్యవర్తిగా ఉపయోగించుకోవాలని చూస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. హమాస్‌తో ఒప్పందం కోసం ఖతార్, తుర్కియే వంటి 'సమస్యాత్మక' దేశాలను అమెరికా ఆశ్రయించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇరాన్ విషయంలో లక్ష్యాల సాధన కోసం సమన్వయం ముఖ్యమని అమెరికా భావిస్తోందని తెలిపారు. ఇరాన్-అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణను ఇజ్రాయెల్ సమర్థిస్తున్నట్లు అజార్ పేర్కొన్నారు.

లెబనాన్‌పై దాడులు ఆగవు:

ఇరాన్ వ్యవహారం ఎలా ఉన్నా, లెబనాన్‌పై తమ సైనిక చర్యలు ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ కుండబద్దలు కొట్టింది. ఇరాన్ ఆపరేషన్‌కు, లెబనాన్ దాడులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. హెజ్‌బొల్లా మౌలిక సదుపాయాలను దక్షిణ లెబనాన్ నుండి పూర్తిగా నిర్మూలించడమే తమ అంతిమ లక్ష్యమని ఆయన వెల్లడించారు. తమ దేశ రక్షణ తమ బాధ్యత అని, హెజ్‌బొల్లాను అంతం చేసే వరకు విశ్రమించబోమని ఇజ్రాయెల్ రాయబారి ఘాటుగా స్పందించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story