Israel Next Target: ఇజ్రాయిల్‌ నెక్ట్స్‌ టార్గెట్‌...టర్కీ? పాకిస్తాన్‌?

Israel Next Target: ప్రపంచ రాజకీయాల్లో కొన్ని సందర్భాలు యుద్ధరంగాన్ని గుర్తు చేస్తాయి. కొన్ని సందర్భాలు ధర్మాధర్మాల మధ్య పోరాటంలా కనిపిస్తాయి.

Balachander
Updated on: 11 April 2026 12:03 PM IST
Israel Next Target
X

Israel Next Target

Israel Next Target: ప్రపంచ రాజకీయాల్లో కొన్ని సందర్భాలు యుద్ధరంగాన్ని గుర్తు చేస్తాయి. కొన్ని సందర్భాలు ధర్మాధర్మాల మధ్య పోరాటంలా కనిపిస్తాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు కూడా అలాంటి పరిస్థితినే చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఇజ్రాయిల్ తీసుకుంటున్న చర్యలు, దాని భద్రతా వ్యూహాలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. “తర్వాతి లక్ష్యం ఎవరు?” అనే ప్రశ్న ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై పెద్ద చర్చగా మారింది.

ఉగ్రవాదులపై విరుచుకుపడేతీరు

భద్రత విషయంలో ఇజ్రాయిల్‌ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. తన దేశాన్ని రక్షించుకోవడానికి ఎలాంటి చర్యలకైనా వెనుకాడదనే విధానాన్ని అది స్పష్టంగా చూపిస్తోంది. ముఖ్యంగా హిజ్బుల్లా వంటి తీవ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ సంస్థలకు మద్దతు ఇస్తున్నదని ఆరోపిస్తూ ఇరాన్‌పై కూడా తన వ్యూహాన్ని మరింత కఠినతరం చేసింది. ఇదే సమయంలో లెబనాన్‌లో దాగున్న ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్‌ దాడులు కొనసాగిస్తోంది. అలాగే గాజా ప్రాంతంలో కూడా తీవ్ర చర్యలు తీసుకుని, అక్కడి మౌలిక వసతులను పూర్తిగా ధ్వంసం చేసినట్టు ప్రపంచం చూసింది. ఈ చర్యలు ఇజ్రాయిల్‌ భద్రతా దృక్పథాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్: టర్కీ, పాకిస్థాన్‌ల గుండెల్లో రైళ్లు

ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే... ఇజ్రాయిల్‌ నెక్ట్స్‌ టార్గెట్‌ ఎవరు అనే సందేహాలు కలుగుతున్నాయి. ఎక్కడ ఉగ్రవాదులు ఉంటారో ఆ దేశాన్ని టార్గెట్‌ చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ దానికి మద్దుగా నిలుస్తున్న టర్కీ పేర్లు వినిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పించే దేశాల జాబితాలో పాకిస్తాన్‌ పేరును పలుమార్లు ప్రస్తావించారు. ఒకప్పుడు ప్రపంచాన్ని కుదిపేసిన ఒసామా బిన్ లాడెన్‌ కూడా పాకిస్తాన్‌లోనే హతమార్చబడిన విషయం తెలిసిందే. ఈ కారణంగా పాకిస్తాన్‌పై అనుమానాలు మరింతగా పెరిగాయి.

టర్కీ విషయానికొస్తే, పాకిస్తాన్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా అది కూడా ఈ వివాదంలో భాగమవుతోంది. ఒక దేశానికి మద్దతు ఇవ్వడం అనేది కేవలం రాజకీయ నిర్ణయం మాత్రమే కాదు… అది భవిష్యత్తులో వచ్చే పరిణామాలకు దారితీసే అంశం కూడా. అందుకే టర్కీపై కూడా ఇజ్రాయిల్‌ కఠినంగా స్పందించే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమంటే శాంతి చర్చలు జరుగుతున్న సమయంలోనే ఈ విధమైన ఉద్రిక్తతలు పెరగడం. ఒకవైపు చర్చలు, మరోవైపు యుద్ధ హెచ్చరికలు… ఈ రెండు కలిసి పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చుతున్నాయి. ముఖ్యంగా లెబనాన్‌పై దాడుల విషయంలో పాకిస్తాన్‌ చేసిన వ్యాఖ్యలు ఇజ్రాయిల్‌ను మరింత ఆగ్రహానికి గురిచేశాయి.

ఇజ్రాయెల్ దాడులు చేస్తే పరిస్థితి ఏమిటి?

ఇజ్రాయెల్ దగ్గర అత్యాధునికమైన 600 కి పైగా యుద్ధ విమానాలు, అత్యంత శక్తివంతమైన 'జెరికో' క్షిపణులు ఉన్నాయి. ఒకవేళ పాకిస్థాన్ లేదా టర్కీ హద్దులు మీరితే, ఇజ్రాయెల్ మెరుపు దాడులకు వెనుకాడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ తన గూఢచారి సంస్థ 'మొసాద్' ద్వారా ఆపరేషన్లు మొదలుపెట్టే అవకాశం ఉంది.

భారత్‌ ఎలా స్పందిస్తుంది

ఒకవేళ ఈ పరిస్థితి మరింత తీవ్రమైతే, అది కేవలం రెండు లేదా మూడు దేశాల మధ్య పరిమితమయ్యే అవకాశం లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ముఖ్యంగా దక్షిణాసియాలోని పరిస్థితులు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత్ ఎలా స్పందిస్తుంది అన్నది కూడా కీలక ప్రశ్నగా మారింది.

మొత్తంగా చూసుకుంటే ... ఈ పరిణామాలు ఒ శాంతి ఎంత విలువైనదో, యుద్ధం ఎంత ప్రమాదకరమో అనే విషయాలను స్పష్టం చేస్తున్నాయి. దేశాలు తమ భద్రత కోసం చర్యలు తీసుకోవడం సహజమే… కానీ అదే సమయంలో శాంతి మార్గాన్ని కూడా మరిచిపోకూడదు. ప్రపంచం ఇప్పుడు ఒక కీలక దశలో నిలిచింది. ఇజ్రాయిల్‌ తదుపరి అడుగు ఏమిటో… అది ఎవరిని లక్ష్యంగా చేసుకుంటుందో… అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. కానీ ప్రతి దేశం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే...శాంతి మార్గమే శాశ్వత పరిష్కారం.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story