Banganapalli: బంగినపల్లి మామిడిపై నిషేదం.. ఎందుకో తెలుసా..?

Banganapalli: భారతీయ మామిడి పండ్ల దిగుమతులపై జపాన్ ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించింది.

Naresh.k
Published on: 29 May 2026 8:06 AM IST
Banganapalli
X

Banganapalli: బంగినపల్లి మామిడిపై నిషేదం.. ఎందుకో తెలుసా..?

Japan Bans Indian Mangoes: భారతీయ మామిడి పండ్ల మధురమైన రుచికి ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులు ఉన్నారు. ముఖ్యంగా పండ్ల రాజా అల్ఫోన్సో, తెలుగు రాష్ట్రాల గర్వకారణం బంగినపల్లి రకాలకు అంతర్జాతీయంగా భారీ డిమాండ్ ఉంటుంది. అయితే, ప్రస్తుత సీజన్‌లో భారతీయ మామిడి ప్రియులకు, ఎగుమతిదారులకు జపాన్ ప్రభుత్వం కోలుకోలేని పెద్ద షాక్ ఇచ్చింది. భారత మామిడి పండ్ల దిగుమతులపై జపాన్ తాత్కాలిక నిషేధం విధించడం ఇప్పుడు అంతర్జాతీయ వాణిజ్య రంగంలో తీవ్ర కలకలం రేపుతోంది. గడిచిన 20 సంవత్సరాలలో జపాన్ ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

భారతదేశం నుండి వచ్చే మామిడి పండ్ల నాణ్యతా ప్రమాణాల విషయంలో తలెత్తిన కొన్ని సాంకేతిక లోపాల కారణంగానే జపాన్ వ్యవసాయ, అటవీ, మత్స్య మంత్రిత్వ శాఖ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. భారత మామిడి పండ్ల ద్వారా పండ్లకు పట్టే ప్రమాదకరమైన కీటకాలు తమ దేశంలోకి ప్రవేశించే ప్రమాదం ఉందని జపాన్ ప్లాంట్ క్వారంటైన్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి వస్తే జపాన్‌లోని స్థానిక వ్యవసాయం, తోటలు పూర్తిగా దెబ్బతింటాయని వారు భయపడుతున్నారు. భారతదేశంలోని కొన్ని ప్రముఖ మామిడి ప్రాసెసింగ్, ప్యాకింగ్ కేంద్రాలలో నిబంధనలను సరిగ్గా పాటించడం లేదని జపాన్ గుర్తించింది.

కీటకాల నియంత్రణ కోసం చేసే ఫ్యూమిగేషన్, డిసిన్ఫెక్షన్ విధానాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేలింది. యోకోహామా ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ద్వారా మార్చి 25 లేదా ఆ తర్వాత భారతదేశంలో జారీ చేసిన ఏ ఒక్క ఇన్‌స్పెక్షన్ సర్టిఫికేట్‌ను కూడా ఆమోదించేది లేదని, భారతీయ మామిడి షిప్‌మెంట్‌లను తమ దేశంలోకి అనుమతించబోమని జపాన్ అధికారులు ఖరాఖండిగా చెప్పారు.

జపాన్ విధించిన ఈ హఠాత్తు నిషేధం కారణంగా భారతదేశపు టాప్ క్వాలిటీ మామిడి రకాల రవాణా పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ వంటి ప్రధాన రాష్ట్రాలలో మామిడి కోతలు పీక్ స్టేజ్‌లో ఉన్నాయి. ఇలాంటి టైమ్‌లో జపాన్ లాంటి పెద్ద మార్కెట్ మూతపడటంతో ఎగుమతిదారులు ఊహించని ఆర్థిక నష్టాలను చవిచూస్తున్నారు. జపాన్ ఆర్డర్ల కోసం ప్రత్యేకంగా ప్యాక్ చేసి, లాజిస్టిక్స్, కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలను సిద్ధం చేసుకున్న వ్యాపారులు.. ఇప్పుడు ఆ స్టాక్‌ను ఏం చేయాలో తెలియక ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story