Japan Earthquake: జపాన్‌లో అతి భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

Japan Earthquake: జపాన్ లో శక్తివంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రత నమోదు కావడంతో క్యూషు ప్రాంతానికి అత్యవసర సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

Arun Chilukuri
Published on: 28 July 2026 2:31 PM IST
Japan Earthquake
X

Japan Earthquake: జపాన్‌లో అతి భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

Japan Earthquake: జపాన్‌ను మరోసారి భారీ భూకంపం వణికించింది. మంగళవారం దక్షిణ క్యూషు ద్వీపకల్పం పరిధిలోని కుమామోటో ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు జపాన్ వాతావరణ ఏజెన్సీ వెల్లడించింది. భూకంప తీవ్రత దృష్ట్యా అధికారులు వెంటనే సునామీ హెచ్చరికలను జారీ చేశారు.

ఈ తీవ్ర భూకంప కేంద్రం సముద్ర మట్టం నుంచి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీని ప్రభావంతో తీర ప్రాంతాల్లో 1 మీటరు నుంచి 3 మీటర్ల (సుమారు 10 అడుగులు) ఎత్తు వరకు సునామీ అలలు ఎగసిపడే అవకాశం ఉన్టట్లు తెలిపారు.

క్యూషు ప్రాంతంలోని కుమామోటో, నాగసాకి, కగోషిమా, ఫుకుయోకా, సాగా, ఓయిటా, మియాజాకి ప్రావిన్సులకు ప్రభుత్వం అత్యవసర భూకంప హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా అరియాకే, యాట్సుషిరో సముద్ర తీర ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ఆదేశించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సముద్ర తీరాల వద్దకు ఎవరూ వెళ్లకూడదని, వెంటనే ఎత్తైన ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులు పౌరులను హెచ్చరించారు.

భూకంప తీవ్రత కారణంగా ప్రసిద్ధ 'షింకాన్సేన్' బుల్లెట్ రైలు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. ఈ ప్రాంతంలోని అను విద్యుత్ కేంద్రాల్లో ప్రస్తుతం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు నమోదు కాలేదని సంబంధిత అధికారులు వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story