Bomb Blast: పాకిస్థాన్‌లో భారీ పేలుడు.. 16 మంది మృతి

Bomb Blast: పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో శుక్రవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోహాట్ ప్రాంతంలోని 'ఓల్డ్ పోలీస్ లైన్స్' సమీపంలో శుక్రవారం ప్రార్థనల సమయంలో.

G Krishna
Published on: 18 Sept 2026 4:50 PM IST
Bomb Blast
X

Bomb Blast: పాకిస్థాన్‌లో భారీ పేలుడు.. 16 మంది మృతి

Bomb Blast: పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో శుక్రవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోహాట్ ప్రాంతంలోని 'ఓల్డ్ పోలీస్ లైన్స్' సమీపంలో శుక్రవారం ప్రార్థనల సమయంలో సంభవించిన భారీ పేలుడు ఘటనలో కనీసం 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో మరో 25 మంది తీవ్రంగా గాయపడినట్లు స్థానిక పోలీసులు, ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మృతి చెందిన వారిలో ఐదుగురు పోలీసు సిబ్బందితో పాటు 11 మంది సాధారణ పౌరులు ఉన్నారు.

పేలుడుతో విరుచుకుపడ్డ విధ్వంసం

పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం, పేలుడు పదార్థాలతో నిండిన ఒక వాహనం వేగంగా వచ్చి ఓల్డ్ పోలీస్ లైన్స్ ప్రధాన గేటును ఢీకొట్టింది. వాహనం గేటును ఢీకొట్టిన మరుక్షణమే పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి మసీదు బయట పెద్ద గుంత ఏర్పడటంతో పాటు సమీపంలోని భవనాల గోడలు కూలిపోయాయి. పేలుడు జరిగిన వెంటనే కొద్దిసేపటి వరకు దుండగులు కాల్పులకు తెగబడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితి.. ముమ్మరంగా సహాయక చర్యలు

ఘటన జరిగిన వెంటనే 'రెస్క్యూ 1122' బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. తీవ్రంగా గాయపడిన వారిని కోహాట్‌లోని డిస్ట్రిక్ట్ హెడ్‌క్వార్టర్స్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి ఒకేసారి 25 మందికి పైగా బాధితులు రావడంతో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. గాయపడిన వారిలో కూడా పలువురు పోలీసు సిబ్బంది ఉన్నట్లు సమాచారం అందుతోంది. బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యుల బృందాలు కృషి చేస్తున్నాయి.

దిగ్బంధంలోకి ప్రాంతం.. విచారణ వేగవంతం

ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, సైనిక దళాలు ఓల్డ్ పోలీస్ లైన్స్ పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా కోహాట్-హంగు రహదారిని తాత్కాలికంగా మూసివేసి, అదనపు బలగాలను మోహరించారు. పాకిస్థాన్ హోమ్‌ మంత్రిత్వ శాఖ ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేసింది. దాడికి పాల్పడిన నిందితుల గుర్తింపును తేల్చేందుకు, పేలుడు స్వభావాన్ని పూర్తిస్థాయిలో తెలుసుకునేందుకు భద్రతా దళాలు క్లియరెన్స్ , శోధన కార్యకలాపాలను వేగవంతం చేశాయి.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.