Amir Hamza: లాహోర్‌లో లష్కరే ఉగ్రవాది ఆమిర్ హమ్జాపై కాల్పులు.. పరిస్థితి విషమం!
Amir Hamza: లష్కరే తయ్యిబా సహ వ్యవస్థాకుడు ఆమిర్ హమ్జాపై పాకిస్థాన్‌లో కాల్పులు. లాహోర్‌లో గుర్తుతెలియని వ్యక్తుల దాడి.
Amir Hamza: లాహోర్‌లో లష్కరే ఉగ్రవాది ఆమిర్ హమ్జాపై కాల్పులు.. పరిస్థితి విషమం!
Amir Hamza: మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, లష్కరే తయ్యిబా సహ వ్యవస్థాకుడు ఆమిర్ హమ్జాపై పాకిస్థాన్‌లోని లాహోర్‌లో గుర్తుతెలియని సాయుధులు కాల్పులు జరిపారు. ఒక న్యూస్ ఛానల్ కార్యాలయం వెలుపల ఈ దాడి జరిగింది. తీవ్రంగా గాయపడిన హమ్జా పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉన్నట్లు జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి.
ఎవరీ ఆమిర్ హమ్జా?
ఆమిర్ హమ్జా అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు అత్యంత సన్నిహితుడు. అఫ్గానిస్థాన్‌లో సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా పోరాడిన హమ్జా, ఆ తర్వాత హఫీజ్ సయీద్‌తో కలిసి లష్కరే తయ్యిబాను స్థాపించాడు. భారత్‌లో జరిగిన పలు ఉగ్రవాద కార్యకలాపాల్లో ఇతడి పాత్రపై బలమైన ఆధారాలు ఉన్నాయి. దీంతో ఐక్యరాజ్యసమితి (UN) ఇతడిని ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించింది. లష్కరేపై ఆంక్షలు పెరిగినప్పుడు 'జైషే మన్‌ఖాపా' అనే సంస్థను స్థాపించి, జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడుల కోసం నిధులు సేకరించాడనే ఆరోపణలు ఉన్నాయి.
వరుస దాడులు.. విఫలమైన భద్రత
కొన్ని నెలల క్రితం కూడా హమ్జాపై హత్యాయత్నం జరిగింది. ఆ ఘటన తర్వాత పాక్ ప్రభుత్వం అతడికి భద్రతను పెంచినట్లు వార్తలు వచ్చాయి. అయినప్పటికీ, కట్టుదిట్టమైన భద్రత నడుమ లాహోర్ వంటి నగరంలో బహిరంగంగా కాల్పులు జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పాకిస్థాన్‌లో వరుసగా భారత వ్యతిరేక ఉగ్రవాదులు గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హతమవుతున్న తరుణంలో ఈ దాడి ప్రాధాన్యత సంతరించుకుంది.




