US Gun Fire: అమెరికాలో కాల్పుల మోత.. దుండగుడి చేతిలో 8 మంది చిన్నారులు బలి!
US Gun Fire: అమెరికాలోని లూసియానాలో జరిగిన దారుణ కాల్పుల ఘటనలో ఎనిమిది మంది చిన్నారులు మృతి. నిందితుడు మరియు పోలీసుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో దుండగుడు హతం.
US Gun Fire: అమెరికాలో కాల్పుల మోత.. దుండగుడి చేతిలో 8 మంది చిన్నారులు బలి!
US Gun Fire: అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్ మరోసారి పడగ విప్పింది. లూసియానా రాష్ట్రంలో ఒక దుండగుడు జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో ఎనిమిది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని, కలకలాన్ని రేపింది.
లూసియానాలో ఒక వ్యక్తి ఆకస్మికంగా చిన్నారులే లక్ష్యంగా తుపాకీతో విరుచుకుపడ్డాడు. ఈ కాల్పుల్లో 14 ఏళ్ల లోపు వయసున్న ఎనిమిది మంది చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, మృతుల్లో కొందరు నిందితుడికి అత్యంత సన్నిహిత బంధువులే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దారుణానికి పాల్పడడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఘాతుకానికి పాల్పడిన తర్వాత నిందితుడు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు అతడిని వెంబడించగా, లొంగిపోవాల్సింది పోయి పోలీసులపైనే కాల్పులు జరిపాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో నిందితుడు మరణించాడు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు, ఈ ఘటన వెనుక ఉన్న పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.




