Makkah Defense Pact: యుద్ధంలోకి దిగిన పాకిస్తాన్.. 'మక్కా డిఫెన్స్ ప్యాక్ట్' యాక్టివేట్
Makkah Defense Pact: హౌతీ తిరుగుబాటుదారుల దాడుల నేపథ్యంతో సౌదీ అరేబియాలో 'మక్కా డిఫెన్స్ ప్యాక్ట్' యాక్టివేట్ అయింది.
Makkah Defense Pact
Makkah Defense Pact: యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై వరుస దాడులకు పాల్పడుతుండటంతో మిడిల్ ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ భయానక పరిస్థితుల నేపథ్యంలో రియాద్ వేదికగా అత్యవసర సమావేశం జరిగింది. సౌదీ రక్షణతో పాటు పవిత్ర స్థలాల పరిరక్షణ కోసం చారిత్రక 'మక్కా డిఫెన్స్ ప్యాక్ట్'ను అధికారికంగా యాక్టివేట్ చేశారు. దీని ప్రకారం పాకిస్తాన్, టర్కీ దేశాలకు చెందిన బలగాలు త్వరలోనే సౌదీకి చేరుకోనున్నాయి.
రియాద్‌లో ముమ్మర చర్చలు
సౌదీ అరేబియా రక్షణ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ నాయకత్వంలో స్ట్రాటెజిక్ పొలిటికల్ అండ్ డిఫెన్స్ కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ భేటీకి పాకిస్తాన్, టర్కీ దేశాల నుంచి అగ్రశ్రేణి దౌత్య, మిలిటరీ అధికారులు హాజరయ్యారు. పవిత్ర స్థలాల భద్రత విషయంలో తమ ఐక్యతను చాటుకుంటూ, శత్రు మూకల దాడులను తిప్పికొట్టడానికి సంయుక్తంగా ముందుకు సాగాలని మూడు దేశాలు నిశ్చయించాయి.
పాకిస్తాన్ ఉన్నతాధికారుల హాజరు
ఈ కీలక భేటీ కోసం పాకిస్తాన్ నుంచి ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ రియాద్ చేరుకున్నారు. ప్రాంతీయ శాంతి పరిరక్షణ కోసం తమ సైనిక సహకారాన్ని అందిస్తామని పాకిస్తాన్ స్పష్టం చేసింది. ఒప్పంద నిబంధనల ప్రకారం హౌతీ దాడులను సమర్థవంతంగా అడ్డుకోవడానికి ముమ్మర ప్రణాళికలు రూపొందించారు.
ఆగస్టులోనే కుదిరిన త్రైపాక్షిక ఒప్పందం
గత ఆగస్టు నెలలో పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ మధ్య ఒక చారిత్రక రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం మూడు దేశాల్లో ఏ ఒక్క దానిపై దాడి జరిగినా, అది మూడింటిపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు. ఇప్పుడు సౌదీపై హౌతీ తిరుగుబాటుదారులు విరుచుకుపడుతుండటంతో ఈ ఒప్పందాన్ని అమలులోకి తెచ్చారు.
శత్రువులకు గట్టి హెచ్చరిక
మక్కా ఒప్పందంలో భాగంగా మూడు దేశాల విదేశాంగ మంత్రులు, రక్షణ మంత్రులు, ఆర్మీ చీఫ్‌లతో కూడిన సైనిక కమిటీ సంయుక్త చర్యలకు రంగం సిద్ధం చేసింది. హౌతీల విధ్వంసకర చర్యలకు బాధ్యులైన వారికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించాయి. రక్షణ చర్యలలో భాగంగా పాక్, టర్కీ బలగాలు సౌదీ సరిహద్దుల్లో మోహరించనున్నాయి.




