Temple Attack: అమెరికాలో భారతీయులను లక్ష్యంగా చేసుకుని ఊచకోతకు యత్నం.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్

అక్టోబర్ 11న నవరాత్రి మొదటి రోజు సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న ప్రముఖ హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఒక దుండగుడు భారీ మారణహోమానికి పథకం పన్నాడు.

CR Reddy
Published on: 15 Oct 2026 11:35 AM IST
Temple Attack
X

Temple Attack

Temple Attack: అమెరికాలోని షికాగో నగరంలో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ 11న నవరాత్రి మొదటి రోజు సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న ప్రముఖ హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఒక దుండగుడు భారీ మారణహోమానికి పథకం పన్నాడు. ప్యాలటైన్‌కు చెందిన 19 ఏళ్ల అలెగ్జాండ్రోస్ పాపోరాకిస్ అనే యువకుడు మోడైఫైడ్ ఏఆర్-స్టైల్ రైఫిల్, 300 తూటాలతో ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించాడు. అయితే అతడు ట్రిగర్ నొక్కినప్పటికీ రైఫిల్ జామ్ కావడంతో భారీ ప్రాణనష్టం తృటిలో తప్పింది. అదృష్టవశాత్తు ఆయుధం పని చేయకపోవడంతో వందలాది మంది భక్తుల ప్రాణాలు రక్షించబడ్డాయి.

భారీ మారణహోమానికి పక్కా ప్లాన్

ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్‌లో క్యాషియర్‌గా పనిచేసే అలెగ్జాండ్రోస్, ఇల్లినాయిస్‌లోని ఆరోరా ప్రాంతంలో ఉన్న అతిపెద్ద హిందూ ఆలయంలో పెద్దఎత్తున భారతీయులను హతమార్చాలనే కుట్రతో అక్కడకు చేరుకున్నాడు. అతని వద్ద పది మ్యాగజైన్లను నింపడానికి సరిపడా 300 రౌండ్ల తూటాలు, బాడీ ఆర్మర్, గ్యాసోలిన్ కెన్లు ఉన్నాయి. అయితే గుడి వద్దకు వెళ్లి కాల్పులు జరపడానికి ప్రయత్నించినప్పుడు తుపాకీ మొరాయించింది. దీంతో భయపడి పారిపోయిన నిందితుడు, నేరుగా తన ఇంటికి వెళ్లి ఇంటర్నెట్‌లో ఆ రైఫిల్ ఎలా రిపేర్ చేయాలో వెతికాడు. అంతేకాకుండా తన సహోద్యోగికి ఫోన్ చేసి తాను సామూహిక కాల్పులకు ప్లాన్ చేసినట్లు తెలిపాడు.

పోలీసుల అప్రమత్తత

నిందితుడు తయారు చేసిన ఒక డాక్యుమెంట్‌లో అణచివేత ధోరణి, నల్లజాతీయులు అలాగే దక్షిణ ఆసియాకు చెందిన భారతీయుల పట్ల తీవ్రమైన ద్వేషం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నేను ఎందుకు పోరాడాను అనే శీర్షికతో ఉన్న ఆ పత్రంలో హిందువులు, భారతీయులపై హింసకు పాల్పడాలనే ఆలోచనలు బహిర్గతమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానిక పోలీసులు ఎఫ్‌బీఐ సహకారంతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఆయుధాలు సిద్ధంగా ఉన్నప్పటికీ తుపాకీ సాంకేతిక లోపం కారణంగా ఒక ఉన్మాది పెద్ద స్థాయి హంతకుడిగా మారకుండా ఆగిపోయాడని పోలీసులు తెలిపారు.

హిందూ అమెరికన్ ఫౌండేషన్ హర్షం

ఈ ఘటనపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా స్పందించింది. అధికారులు సకాలంలో స్పందించి నిందితుడిని పట్టుకోవడం పట్ల ప్రశంసలు కురిపించింది. ఏ వర్గమైనా ఎలాంటి భయం లేకుండా ప్రార్థనలు చేసుకునే హక్కు కలిగి ఉంటుందని స్పష్టం చేసింది. ఎఫ్‌బీఐ షికాగో ప్రత్యేక ఏజెంట్ రయాన్ వేలెన్ మాట్లాడుతూ, ఇటువంటి తీవ్రవాద భావజాలాలను ముందే అణచివేయడాని

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.