Moscow Drone Attack : రష్యా రాజధాని మాస్కోపై చరిత్రలోనే బిగ్గెస్ట్ డ్రోన్ ఎటాక్.. ఉక్రెయిన్ మాస్టర్ ప్లాన్
Moscow Drone Attack : మాస్కోపై ఉక్రెయిన్ జరిపిన భారీ డ్రోన్ దాడిని అడ్డుకోవడంలో రష్యా ఎస్-400 వ్యవస్థ విఫలమైంది. రాడార్ బ్లైండ్ స్పాట్స్, కంబైన్డ్ అటాక్స్ వల్లే ఈ రక్షణ లోపం తలెత్తింది.
Moscow Drone Attack
Moscow Drone Attack : రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య సాగుతున్న సుదీర్ఘ యుద్ధంలో గురువారం నాడు ఒక సంచలన ఘట్టం నమోదైంది. ఉక్రెయిన్ సైన్యం రష్యా రాజధాని మాస్కో నగరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇప్పటివరకు జరగనంత అతిపెద్ద డ్రోన్ దాడికి పాల్పడింది. ఒకేసారి 200 కంటే ఎక్కువ డ్రోన్లు మాస్కో వైపు దూసుకొచ్చాయి. ఈ ఘోర దాడి కారణంగా మాస్కోలోని ఒక ప్రముఖ ఆయిల్ రిఫైనరీ పూర్తిగా దెబ్బతినడమే కాకుండా అనేక ప్రాంతాల్లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ దాడిలో ఒకరు మరణించగా, మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. భద్రతా కారణాల దృష్ట్యా మాస్కోలోని అన్ని పెద్ద విమానాశ్రయాలను కాసేపు పూర్తిగా మూసివేశారు.
రష్యా రక్షణ వాదనలు, ఎస్-400 వైఫల్యం
మాస్కో వైపు దూసుకొచ్చిన డ్రోన్లలో దాదాపు 194 డ్రోన్లను తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ సాయంతో గాల్లోనే కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 1,000 ఉక్రెయిన్ డ్రోన్లను అడ్డుకున్నామని, అందులో కొన్నింటిని అజోవ్ సముద్రంపైనే పేల్చేశామని రష్యా పేర్కొంది. అయితే ఇంత జరిగినా కూడా కొన్ని డ్రోన్లు మాస్కో నడిబొడ్డుకు చేరుకుని విధ్వంసం సృష్టించాయి. ఈ క్రమంలో రష్యా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈ చిన్న డ్రోన్లను వంద శాతం అడ్డుకోవడంలో ఎందుకు ఫెయిల్ అయిందనే దానిపై రక్షణ నిపుణులు కీలక కారణాలను వెల్లడించారు.
రాడార్లకు దొరకని బ్లైండ్ స్పాట్ మ్యాజిక్
ఎస్-400 రక్షణ వ్యవస్థను నిజానికి చాలా ఎత్తులో ఎగిరే పెద్ద యుద్ధ విమానాలు, భారీ బాంబర్లు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే బాలిస్టిక్ మిసైళ్లను కూల్చివేయడానికి డిజైన్ చేశారు. కానీ ఉక్రెయిన్ పంపిన డ్రోన్లు భూమికి చాలా దగ్గరగా, భవనాలు, కొండల చాటున దాక్కుంటూ ప్రయాణించాయి. భూమి గుండ్రంగా ఉండటం వల్ల రాడార్ల పరిధికి ఒక నిర్దిష్ట దూరం తర్వాత కింద ఉండే వస్తువులు కనిపించవు. దీన్నే మిలిటరీ భాషలో రాడార్ హొరైజన్ లేదా బ్లైండ్ స్పాట్ అంటారు. ఈ లూప్‌హోల్‌ను వాడుకుని ఉక్రెయిన్ డ్రోన్లు రష్యా రాడార్ల కన్నుగప్పి మాస్కోకు అత్యంత సమీపంలోకి వచ్చేంతవరకు దొరకలేదు.
రష్యా కంప్యూటర్లను హ్యాంగ్ చేసిన సాచురేషన్ అటాక్
ఉక్రెయిన్ ఈ దాడి కోసం సాచురేషన్ అటాక్ అనే అత్యాధునిక మిలిటరీ వ్యూహాన్ని ఉపయోగించింది. అంటే ఒకేసారి వందల సంఖ్యలో డ్రోన్లను రష్యా సరిహద్దుల పైకి వదిలింది. ఇందులో నిజమైన బాంబులు ఉన్న డ్రోన్లతో పాటు, రష్యాను కన్‌ఫ్యూజ్ చేయడానికి ఎన్నో నకిలీ డ్రోన్లను కూడా పంపింది. ఒకేసారి వేల సంఖ్యలో టార్గెట్లు రాడార్ స్క్రీన్‌పై కనిపించడంతో ఎస్-400 లోని కంప్యూటర్ సిస్టమ్, కమాండ్ పోస్ట్ పూర్తిగా ఓవర్‌లోడ్ అయిపోయాయి. మొదట దేన్ని షూట్ చేయాలో, ఏది అసలైన ముప్పో తేల్చుకోలేక సిస్టమ్ సామర్థ్యం పూర్తిగా పడిపోయింది.
మల్టీ లేయర్ డిఫెన్స్ నెట్‌వర్క్ లోపాలు
యుద్ధ రంగంలో ఎస్-400 సిస్టమ్ ఒంటరిగా పనిచేయదు. దానికి రక్షణగా, చిన్న చిన్న ముప్పులను అడ్డుకోవడానికి పాంట్‌సిర్ లేదా బుక్ వంటి తక్కువ దూర పరిధి కలిగిన చిన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ బ్యాకప్‌గా ఉండాలి. ఎస్-400 పెద్ద వాటిని టార్గెట్ చేస్తే, ఈ చిన్న సిస్టమ్స్ డ్రోన్లను కూల్చాలి. కానీ మాస్కో దాడి సమయంలో రష్యాకు చెందిన ఈ వివిధ రక్షణ వ్యవస్థల మధ్య సరైన కమ్యూనికేషన్, తగిన సమన్వయం లోపించింది. దాంతో ఉక్రెయిన్ డ్రోన్లు రష్యా మల్టీ లేయర్ రక్షణ వలయాన్ని సులువుగా చేధించుకుని లోపలికి చొరబడ్డాయి.
మిసైళ్ల కొరత, సప్లై చైన్ సంక్షోభం
ఎస్-400 వ్యవస్థలో ఉపయోగించే ఒక్కో ఇంటర్సెప్టర్ మిసైల్ ధర కోట్ల రూపాయల్లో ఉంటుంది. సుదీర్ఘ కాలంగా యుద్ధం జరుగుతుండటం వల్ల రష్యా దగ్గర ఈ ఖరీదైన క్షిపణుల స్టాక్ క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఉక్రెయిన్ పంపిన కొన్ని వందల రూపాయల విలువైన చౌకబారు డ్రోన్లను కూల్చడానికి కోట్ల రూపాయల విలువైన క్షిపణులను వాడటం రష్యాకు పెద్ద ఆర్థిక నష్టంగా మారింది. సప్లై చైన్ నెమ్మదించడంతో కొత్త మిసైళ్లను త్వరగా తయారు చేయలేక, క్షిపణులను పొదుపుగా వాడాలనే రష్యా వ్యూహం చివరకు మాస్కోపై పెద్ద దెబ్బ పడేలా చేసింది.




