సోషల్ మీడియా పోస్టుల కేసు.. పాకిస్తాన్‌లో వ్యక్తికి మరణశిక్ష

Pakistan Blasphemy: సోషల్ మీడియాలో దైవదూషణకు సంబంధించిన పోస్టులు పెట్టాడన్న ఆరోపణలపై పాకిస్తాన్‌లోని ఒక ఉగ్రవాద నిరోధక కోర్టు వ్యక్తికి మరణశిక్ష విధించింది.

G Krishna
Published on: 21 Nov 2026 7:13 PM IST
Pakistan Blasphemy
X

సోషల్ మీడియా పోస్టుల కేసు.. పాకిస్తాన్‌లో వ్యక్తికి మరణశిక్ష

Pakistan Blasphemy: సోషల్ మీడియాలో దైవదూషణకు సంబంధించిన పోస్టులు పెట్టాడన్న ఆరోపణలపై పాకిస్తాన్‌లోని ఒక ఉగ్రవాద నిరోధక కోర్టు వ్యక్తికి మరణశిక్ష విధించింది. రావల్పిండిలోని ఉగ్రవాద నిరోధక కోర్టు మహమ్మద్ ఇబ్తిసామ్ ముస్తఫాకు ఈ శిక్ష ఖరారు చేసినట్లు ఓ అధికారి తెలిపారు. ప్రవక్త ముహమ్మద్‌ను, ఖురాన్‌ను దూషించాడని నిరూపించే సాక్ష్యాలు, సాక్షులను ప్రాసిక్యూషన్ కోర్టు ముందు ఉంచింది. మరణశిక్షతో పాటు దోషికి 12 లక్షల పాకిస్తానీ రూపాయల జరిమానా కూడా విధించారు.

ఎనిమిదేళ్ల తర్వాత తీర్పు.. కనికరం చూపలేమన్న కోర్టు

తీర్పు సందర్భంగా న్యాయమూర్తి అమ్జద్ అలీ షా మాట్లాడుతూ, ఉన్న సాక్ష్యాధారాలు చూస్తుంటే దోషికి ఎలాంటి కనికరం చూపాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ముస్తఫాపై కేసు నమోదైన ఎనిమిదేళ్ల తర్వాత ఈ తీర్పు రావడం గమనార్హం.

హక్కుల సంఘాల ఆందోళన.. భద్రతా ముప్పులు

మానవ హక్కుల సంఘాల మాటల ప్రకారం, దిగువ కోర్టులు చాలా సందర్భాల్లో బలహీనమైన సాక్ష్యాలు లేదా ఆస్తి తగాదాల కారణంగా ఇలాంటి శిక్షలు విధిస్తుంటాయి. పైకోర్టుల్లో అప్పీలు చేసినప్పుడు వాటిలో చాలావరకు కొట్టివేయబడ్డ సందర్భాలు ఉన్నాయి. చరిత్ర చూసుకుంటే పాకిస్తాన్‌లో దైవదూషణ కేసుల్లో ఇప్పటివరకు ప్రభుత్వపరంగా మరణశిక్ష అమలు చేసిన దాఖలాలు లేవు. అయినప్పటికీ నిందితులు, వాళ్ల తరఫున వాదించే న్యాయవాదులు తరచూ భద్రతా సమస్యలు, మూక దాడుల ముప్పును ఎదుర్కొంటూనే ఉంటారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.