Pakistan: పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. బడి పైకప్పు కూలి 29 మంది దుర్మరణం!

Pakistan: పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ప్రైవేటు పాఠశాల పైకప్పు కూలి 29 మంది మృతి. 28 మంది విద్యార్థులు, ఉపాధ్యాయురాలు దుర్మరణం, ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్ర దిగ్భ్రాంతి.

Arun Chilukuri
Published on: 15 Oct 2026 2:05 PM IST
Pakistan
X

Pakistan: పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. బడి పైకప్పు కూలి 29 మంది దుర్మరణం!   

Pakistan: పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ రాజధాని పెషావర్‌లో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు పాఠశాల భవనం పైకప్పు ఒక్కసారిగా కూలిపోవడంతో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో 28 మంది పసిపాపలు/విద్యార్థులు కాగా, మరొకరు ఉపాధ్యాయురాలు కావడం తీవ్ర శోకసంద్రాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో మరో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

గురువారం ఉదయం పాఠశాలలో తరగతులు జరుగుతున్న సమయంలో పాఠశాల భవన పైకప్పు ఒక్కసారిగా విరిగి పడింది. ప్రమాద సమయంలో తరగతి గదుల్లో దాదాపు 13 ఏళ్ల లోపు వయసున్న విద్యార్థులు ఉన్నారు.

సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీమ్‌లు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీశారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

భవన నిర్మాణాలు, భద్రతా ప్రమాణాలు పాటించడంలో తీవ్ర అలసత్వం వహించినందుకు గానూ పాఠశాల యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

పాఠశాల పైకప్పు కూలిన దుర్ఘటనపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆయన, గాయపడిన విద్యార్థులకు అత్యుత్తమ వైద్య సహాయం అందించాలని స్థానిక అధికారులను ఆదేశించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.