Panama earthquake: పనామాలో మళ్లీ భూకంపం.. 6.0 తీవ్రతతో ప్రకంపనలు!
Panama earthquake: పనామాలో మరోసారి 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. 7.7 తీవ్రత భూకంపం తర్వాత 300కుపైగా ఆఫ్టర్‌షాక్స్‌తో ప్రజల్లో ఆందోళన.
Panama earthquake: పనామాలో మళ్లీ భూకంపం.. 6.0 తీవ్రతతో ప్రకంపనలు!
Panama earthquake: లాటిన్ అమెరికా దేశమైన పనామాలో మరోసారి భూకంపం సంభవించింది. సోమవారం చోటుచేసుకున్న ఈ భూప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైనట్లు యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ (EMSC) వెల్లడించింది. భూమికి సుమారు 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇటీవలే పనామాను 7.7 తీవ్రతతో భారీ భూకంపం కుదిపేసిన విషయం తెలిసిందే. శుక్రవారం సంభవించిన ఈ పెను ప్రకంపనల ప్రభావంతో దాదాపు 900 భవనాలు దెబ్బతినగా, 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘటన తర్వాత కూడా పనామాలో భూమి ప్రకంపనలు కొనసాగుతున్నాయి.
భారీ భూకంపం అనంతరం ఇప్పటివరకు 300కు పైగా ఆఫ్టర్‌షాక్స్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. తాజాగా 6.0 తీవ్రతతో మరోసారి భూమి కంపించడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. వరుస ప్రకంపనల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసి, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.
భూకంపాల తీవ్రత, వరుసగా సంభవిస్తున్న ఆఫ్టర్‌షాక్స్ కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, దెబ్బతిన్న భవనాలను పరిశీలించడం వంటి చర్యలు కొనసాగుతున్నాయి.




