Peru Conehead Mummies: శాస్త్రవేత్తలకు సవాల్‌ విసురుతున్న పెరూ కోన్‌హెడ్స్‌... అంతుచిక్కని డీఎన్‌ఏ...గ్రహాంతరవాసులుగా అనుమానం

పెరూలో లభించిన కోన్‌ హెడ్స్‌ భూమిపై నివశించిన మనిషికి చెందినవా లేదా గ్రహాంతరవాసులకు చెందినవా అనే దానిపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి.

Balachander
Updated on: 30 May 2026 1:14 PM IST
Peru Conehead Mummies:  శాస్త్రవేత్తలకు సవాల్‌ విసురుతున్న పెరూ కోన్‌హెడ్స్‌... అంతుచిక్కని డీఎన్‌ఏ...గ్రహాంతరవాసులుగా అనుమానం
X

Peru Conehead Mummies: ఎన్నో వందల సంవత్సరాల నుంచి మనుషులను వేదిస్తున్న చిక్కు ప్రశ్న. ఈ భూమిపై మనుషులు కాకుండా వేరే ఇంకెవరైనా ఉన్నారా? మనుషుల ఆవిర్భావం కంటే ముందు ఈ భూమిపైకి గ్రహాంతరవాసులు వచ్చారా అనే ప్రశ్నలు మనిషి మస్తిష్కాన్ని తొలుస్తూనే ఉన్నాయి. దీనికి సమాధానంగా నిలుస్తున్నాయి పెరూ దేశంలో లభించిన కొన్ని వింత పుర్రెలు. దక్షిణ అమెరికా దేశమైన పెరూలో లభించిన ఈ వింత ఆకారపు పుర్రెలు మానవ జాతికి చెందినవి కావని, అవి గ్రహాంతరవాసుల పూర్వికులకు చెందినవి కావచ్చుననే అనుమానాలు ఇప్పుడు మరింత బలపడుతున్నాయి. అమెరికాలోని వర్జీనియాకు చెందిన 'లిబర్టీ యూనివర్సిటీ' పరిశోధకులు ఈ మమ్మీలపై సరికొత్తగా జరిపిన డీఎన్‌ఏ అనాలిసిస్ సైతం విఫలం కావడంతో దీనిపై మరింత ఉత్కంఠ నెలకొంది.

అసలు మిస్టరీ ఏమిటి? పెరూ పరాకాస్ పుర్రెలు

ఈ పుర్రెల గురించి తెలియాలంటే మనం 1920 ప్రాంతానికి వెళ్లాలి. 1920వ దశాబ్దంలో పెరూ తీరప్రాంతంలో పరాకాస్‌ అనే ఏడాదిలో పరిశోధకులు కొన్ని వందల సంఖ్యలో వింతైన మమ్మీలు లభించాయి. ఈ వింత మమ్మీల్లో పరిశోధకులను ఆకట్టుకున్నది పొడవైన పుర్రెలే. శంఖం ఆకృతిలో పొడవుగా ఉన్న ఈ పుర్రెలు సాధారణ మనిషికంటే భిన్నందగా ఉండటంతో ఆసక్తి పెరిగింది. ఈ పుర్రెను క్రీస్తుపూర్వం 100వ శతాబ్ధానికి చెందినవిగా పరిశోధకులు అంచనా వేస్తున్నారు. దీనిపై పరిశోధనలు చేసిన కొందరు పరిశోధకులు ఓ వాదనను తెరమీదకు తీసుకొచ్చారు. క్రీస్తుపూర్వం పెరూ ప్రాంతానికి చెందిన ఉన్నత హోదా, రాజరికపు గుర్తింపు ఉన్నవారు బాల్యం నుంచే తలపై బలమైన పట్టీలు కట్టి పుర్రె ఆకారంలో మార్పులు చేసేవారనే వాదనను తీసుకొచ్చారు. అయితే, ఈ పుర్రెలను ఆధారం చేసుకొని ఆధునికంగా అందుబాటులో ఉన్న టెక్నాలజీతో డీఎన్ఏ టెస్టులు నిర్వహించగా... పెర్రెలోని జన్యువులు అసాధారణంగా ఉన్నట్టుగా తేలింది. మనిషి జన్యువులతో ఇవి మ్యాచ్‌ కాలేదు. ఈ పుర్రెలు భూమిపై నివశించిన అపరిచిత హ్యుమనాయిడ్స్‌ లేదా గ్రహాంతరవాసులవో అయి ఉంటాయని భావిస్తున్నారు.

పంటి నుండి డీఎన్‌ఏ సేకరణ

ఈ మమ్మీల మూలాలను శాస్త్రీయంగా తేల్చేందుకు వర్జీనియా పరిశోధకురాలు అబిగైల్ మెక్‌డోవెల్ నేతృత్వంలోని బృందం ఒక వినూత్న ప్రయత్నం చేసింది. ఈసారి మమ్మీల జుట్టు లేదా చర్మానికి బదులుగా, వాటి పంటి లోపల సురక్షితంగా ఉండే పల్ప్ నుండి డీఎన్‌ఏను సేకరించడానికి సిద్ధమయ్యారు. దీనికోసం వారు రెండు రకాలైన పరీక్షలు నిర్వహించారు. పంటి లోపలి భాగం నుంచి కొద్దిపాటి పొడిని సేకరించగా అందులో 2.3 యూనిట్ల డీఎన్‌ఏ లభించింది. అదేవిధంగా పంటిని పొడిగా చేసి దాని నుంచి 14.1 యూనిట్ల డీఎన్‌ఏను సేకరించారు.

ప్రయోగం ఎందుకు విఫలమైంది?

శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం... ఒక పురాతన జీవి యొక్క జన్యు క్రమాన్ని పూర్తిగా ల్యాబ్‌లో పునర్నిర్మించి, అది ఏ జాతికి చెందినదో ఖచ్చితంగా ప్రకటించాలంటే కనీసం 20 యూనిట్ల డీఎన్‌ఏ లభించాలి. 20 యూనిట్ల డీఎన్‌ఏ కంటే తక్కువ డీఎన్‌ఏ లభిస్తే దాని నుంచి పూర్తి జన్యుక్రమాన్ని నిర్మించడం కష్టం అవుతుంది. కానీ, ఈ పురాతన మమ్మీల కోన్‌ హెడ్స్‌ నుంచి కేవలం 14.1 యూనిట్ల డీఎన్‌ఏ మాత్రమే లభ్యమైంది. ఇప్పటి వరకు భూమిపై నివశించిన మనుషులకు సంబంధించిన పుర్రెల్లో 20 యూనిట్లకు పైగానే డీఎన్‌ఏ లభించింది. దీని ఆధారంగా అది ఏ జాతికి చెందిందో గుర్తించేవారు. కానీ, పెరూలో లభించిన ఈ పుర్రెల్లో కేవలం 14.1 యూనిట్ల డీఎన్‌ఏ మాత్రమే లభ్యం కావడంతో ఈ పుర్రెలు గ్రహాంతవాసులకు చెందినవై ఉంటాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

తదుపరి పరిశోధనల దిశగా...

ప్రస్తుతం ఈ రహస్యాన్ని ఛేదించేందుకు పరిశోధకులు "డిమినరలైజేషన్" అనే సరికొత్త కెమికల్ గ్రైండింగ్ ప్రక్రియను ఉపయోగించబోతున్నారు. దీని ద్వారా పంటి నుండి మరింత నాణ్యమైన డీఎన్‌ఏను సేకరించి, దానిని మమ్మీల జుట్టు నుండి వచ్చే జన్యువులతో పోల్చి చూడనున్నారు. ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి సైతం చిక్కని ఈ పెరూ కోన్‌హెడ్స్ రహస్యం భవిష్యత్తులో ఎలాంటి సత్యాలను బయటపెడుతుందో వేచి చూడాలి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story