iPhones: హర్మూజ్ జలసంధిలో మైండ్ బ్లాకింగ్ సీన్: సముద్రంలో కుప్పలుగా తేలియాడుతున్న ఐఫోన్లు!

iPhones: హర్మూజ్ జలసంధిలో మైన్‌ను ఢీకొని మునిగిపోయిన సింగపూర్ కార్గో నౌక జీఎఫ్‌ఎస్ ప్రైడ్. సముద్రంలో తేలియాడుతున్న ఐఫోన్లు, సరకులు.. సిబ్బంది సురక్షితం.

Arun Chilukuri
Published on: 15 Oct 2026 4:09 PM IST
iPhones
X

iPhones: హర్మూజ్ జలసంధిలో మైండ్ బ్లాకింగ్ సీన్: సముద్రంలో కుప్పలుగా తేలియాడుతున్న ఐఫోన్లు!

iPhones: అంతర్జాతీయ నౌకా రవాణా మార్గమైన హర్మూజ్ జలసంధిలో (Strait of Hormuz) భారీ ప్రమాదం చోటుచేసుకుంది. దాదాపు 2,500 కంటైనర్ల సరకుతో ప్రయాణిస్తున్న సింగపూర్ జెండా కలిగిన ‘జీఎఎఫ్ఎస్ ప్రైడ్’ (GFS Pride) అనే కార్గో నౌక సముద్రంలో మైన్‌ను (Sea Mine) ఢీకొని నీట మునిగిపోయింది. ఈ ఘటనను ఇరాన్ విప్లవాత్మక బలగాలు (IRGC) అధికారికంగా ధృవీకరించాయి. మైన్‌ను ఢీకొట్టడం వల్ల నౌక మునిగిపోయిందని ఐఆర్‌జీసీ ప్రకటించడం ఇదే తొలిసారి కావడంతో అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

చట్టవిరుద్ధమైన, అత్యంత ప్రమాదకరమైన మార్గంలో ప్రయాణిస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఇరాన్ స్థానిక మీడియా, అధికారులు వెల్లడించారు.

దుబాయ్ నుంచి బయలుదేరిన ఈ నౌకలో ఐఫోన్లు (iPhones), విలాసవంతమైన లగ్జరీ పెర్ఫ్యూమ్‌లు సహా ఇతర ఖరీదైన వస్తువులు ఉన్నాయి. ప్రమాదం ధాటికి కంటైనర్లు సముద్రంలో చెల్లాచెదురై, ఐఫోన్ల పెట్టెలు నీటిపై తేలియాడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి.

హర్మూజ్ మార్గంలో సింగపూర్‌కు చెందిన రెండు నౌకలు ప్రమాదానికి గురైనప్పటికీ, అందులో మునిగిపోయిన నౌకలోని సిబ్బందిని సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తరలించాయని సింగపూర్ పోర్ట్ అధికారులు స్పష్టం చేశారు. సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.