Mass Shooting: ఏకే-47 తుపాకులతో రెచ్చిపోయిన దుండగులు.. ఏకంగా 27 మంది మృ
Mass Shooting: సౌతాఫ్రికా దేశంలో శనివారం రాత్రి జరిగిన భారీ కాల్పుల ఘటన ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
Mass Shooting
Mass Shooting: సౌతాఫ్రికా దేశంలో శనివారం రాత్రి జరిగిన భారీ కాల్పుల ఘటన ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. గౌతంగ్ ప్రావిన్స్‌లోని జోహెన్నెస్‌బర్గ్ నగరానికి నైరుతి దిశలో ఉన్న వెడెలా టౌన్‌షిప్‌లోని ఒక బార్లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో కొందరు దుండగులు బార్లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటనలో మరో 15 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఏకే-47 తుపాకులతో కాల్పులు
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం శనివారం రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో 8 మంది గుర్తుతెలియని దుండగులు బార్ వద్దకు వచ్చారు. మొదట బయట కూర్చుని మద్యం తాగుతున్న వారిపై తూటాల వర్షం కురిపించారు. ఆ తర్వాత నేరుగా టెవెర్న్ లోపలికి వెళ్లి అక్కడ ఉన్న అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. దుండగుల వద్ద ఏకే-47 రైఫిల్స్‌తో పాటు అధునాతన పిస్తుళ్లు ఉండటం గమనార్హం. మృతులలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు.
#BREAKING At least 17 people were killed and 15 others seriously wounded in a mass shooting at a tavern in Wedela, near Carletonville, South Africa, on Saturday night.
Police said at least eight suspects armed with AK-47 rifles and handguns opened fire on patrons outside the tavern before entering and continuing to shoot inside. Thirteen men and four women were killed. The motive remains unknown, and police are searching for the suspects.
— Global OSINT (@GlobalOSINTHQ) September 27, 2026
పరారీలో నిందితులు
ఈ ఘోర దాడి జరిగిన వెంటనే దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఇప్పటివరకు ఏ ఒక్క నిందితుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేయలేదు. పరారీలో ఉన్న హంతకుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఈ భయానక ఘటనకు సంబంధించిన ఏ చిన్న సమాచారం ఉన్నా ప్రజలు వెంటనే పోలీసులకు అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
దాడికి అసలు కారణాలు
ఈ మూకదాడికి గల అసలు కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కక్షసాధింపు చర్యలా లేక మరేదైనా నేరపూరిత ఉద్దేశంతో ఈ దారుణానికి పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బార్లో ఉన్నవారినే ప్రత్యేకంగా టార్గెట్ చేయడానికి దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. వరుస కాల్పుల ఘటనలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతుండగా, ప్రభుత్వం భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది.




