Train Accident: స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 46 మంది మృతి

Train Accident: స్పెయిన్ టోలెడో ప్రావిన్సులో ఘోర రైలు ప్రమాదం. రెండు హైస్పీడ్ రైళ్లు ఢీకొని 46 మంది మృతి, 179 మందికి గాయాలు.

Arun Chilukuri
Published on: 28 Oct 2026 5:19 PM IST
Train Accident
X

Train Accident: స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 46 మంది మృతి

Train Accident: స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. టోలెడో ప్రావిన్సులో రెండు అత్యంత వేగంతో వెళ్లే హైస్పీడ్‌ రైళ్లు పరస్పరం ఢీకొన్న ఘటనలో 46 మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, 179 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

బుధవారం ఉదయం స్పెయిన్ రాజధాని మాద్రిద్‌ నుంచి సెవిల్లే వైపు ఒకే మార్గంలో రెండు రైళ్లు ప్రయాణిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.

లైన్‌లో ముందే ఆగి ఉన్న ఒక రైలును వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో హైస్పీడ్ రైలు ఢీకొట్టింది. ఈ భయంకర ఢీతో రెండు బోగీలు తీవ్రంగా ధ్వంసమై పూర్తిగా పట్టాలు తప్పాయి. ప్రమాద సమయంలో ఆగి ఉన్న రైలులో 147 మంది, వెనుక నుంచి వచ్చిన రైలులో 397 మంది ప్రయాణికులు ఉన్నారు.

సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదం కారణంగా మాద్రిద్‌, సియదాద్‌ రియల్‌, అందాలూసియా నగరాల మధ్య రైళ్ల రాకపోకలను స్పెయిన్‌ రైల్‌ ఆపరేటర్‌ ఏడీఐఎఫ్‌ (ADIF) తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రమాదానికి గల సాంకేతిక లోపాలు లేదా మానవ తప్పిదాలపై అధికారులు పూర్తిస్థాయి విచారణ ప్రారంభించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.