Spain Train Accident: స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 39 మంది మృతి!
Spain Train Accident: స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మాడ్రిడ్ సమీపంలోని టోలెడో ప్రావిన్స్‌లో బుధవారం ఉదయం రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 39 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు.
Spain Train Accident: స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 39 మంది మృతి!
Spain Train Accident: స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మాడ్రిడ్ సమీపంలోని టోలెడో ప్రావిన్స్‌లో బుధవారం ఉదయం రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 39 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఆగి ఉన్న రైలును ఢీకొన్న మరో రైలు
రైల్వే వ్యవస్థను నిర్వహించే ADIF సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మాడ్రిడ్ నుంచి అండలూసియా వైపు వెళ్లే హైస్పీడ్ రైలు మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దక్షిణ దిశగా వెళ్తున్న ప్రభుత్వ రంగ సంస్థ రెన్ఫేకు చెందిన AVE రైలు.. అప్పటికే నిలిచివున్న Iryo రైలును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదం ధాటికి కొన్ని రైలు బోగీలు పట్టాలు తప్పి, రైల్వే మార్గం పక్కనున్న వాలులోకి దొర్లిపోయాయి.
నిలిచిపోయిన రైలు సేవలు
ప్రమాదం నేపథ్యంలో మాడ్రిడ్–అండలూసియా హైస్పీడ్ రైలు మార్గంలో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ADIF ప్రకటించింది. మాడ్రిడ్, సియుడాడ్ రియల్, అండలూసియా మధ్య రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులకు అసౌకర్యం కలగడంతో పాటు, ప్రమాద ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం
ఈ ఘటనపై అధికారులు మాట్లాడుతూ.. ఇప్పటివరకు 39 మంది మరణించినట్లు నిర్ధారించామని తెలిపారు. అయితే, ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు, ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




