Lottery: 30 ఏళ్ల నిరీక్షణ..లాటరీలో దంపతులకు రూ.386 కోట్ల జాక్‌పాట్!
Lottery: అమెరికా టెక్సాస్‌లో ఓ దంపతులకు రూ.386 కోట్ల లాటరీ తగిలింది. గత 30 ఏళ్లుగా క్రమం తప్పకుండా టికెట్లు కొంటున్న వీరికి ఊహించని అదృష్టం దక్కింది.
Lottery: 30 ఏళ్ల నిరీక్షణ..లాటరీలో దంపతులకు రూ.386 కోట్ల జాక్‌పాట్!
Lottery: అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పలేం. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తే ఏదో ఒక రోజు విజయం వరిస్తుందని అమెరికాలోని ఓ దంపతులు నిరూపించారు. సుమారు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఈ దంపతులకు లాటరీలో భారీ మొత్తంలో నగదు బహుమతి లభించింది.
30 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం:
అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని రిచర్డ్‌సన్‌కు చెందిన ఓ దంపతులు గత 30 ఏళ్లుగా క్రమం తప్పకుండా లాటరీలో పాల్గొంటున్నారు. ప్రతిసారీ నిరాశే ఎదురవుతున్నా, అదృష్టం ఏదో ఒక రోజు తమ తలుపు తట్టకపోతుందా అన్న ఆశతో టికెట్లు కొనుగోలు చేస్తూనే వచ్చారు. వీరి నిరీక్షణకు తాజాగా ఫలితం దక్కింది.
రూ. 386 కోట్ల భారీ ప్రైజ్ మనీ:
ఇటీవల తీసిన లక్కీ డ్రాలో ఈ దంపతులకు ఏకంగా 41 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 386 కోట్లు) లాటరీ తగిలింది. ఒక్కసారిగా ఇంత భారీ మొత్తం సొంతం కావడంతో ఆ దంపతులు ఆనందంలో మునిగిపోయారు. "మేము ఎప్పుడూ నమ్మకాన్ని వదులుకోలేదు, మా ఓపికకు దక్కిన గౌరవం ఇది" అని వారు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "నిరీక్షణకు తగ్గ ఫలితం లభించింది" అంటూ నెటిజన్లు ఆ దంపతులకు అభినందనలు తెలుపుతున్నారు.




