South Korea: ఇది భోజనం కాదు...అమృతంః కొరియా చెబుతున్న నిజం
South Korea: ఒకప్పుడు పిల్లలకు భోజనంలో తప్పనిసరిగా మినప లేదా పెసర గారెలు వడ్డించేవారు. కారణమేంటో తెలుసా? మినుములు శరీనాన్ని ఉక్కులా మారుస్తాయి.
South Korea
South Korea: ఒకప్పుడు పిల్లలకు భోజనంలో తప్పనిసరిగా మినప లేదా పెసర గారెలు వడ్డించేవారు. కారణమేంటో తెలుసా? మినుములు శరీనాన్ని ఉక్కులా మారుస్తాయి. పెసలు శరీరానికి అవసరమైన పోషకాలను ఇస్తాయి. ఇందులో వాడే మిగతా దినుసులు మన తెలివితేటలను పెంచుతాయి. అందుకే పూర్వం రోజుల్లో బడికి వెళ్లే పిల్లల మెనూలో తప్పనిసరిగా గారెలు ఉండేవి.
కానీ, ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ ప్రపంచంలో పిల్లల లంచ్ బాక్స్‌లో కేకులు, పాస్తా, సమోసా లేదా ఇతర ఫాస్ట్‌ఫుడ్ పెట్టి పంపుతున్నారు. త్వరగా అవుతుందనే భావనతో ఇలా చేస్తున్నారు. కానీ, దీని వలన చిన్నారుల శరీరం విషమయంగా మారుతుంది. తినే ఆహారమే మన తెలివితేటలుగా మారతాయి. తెలివి పెరగాలి అంటే బ్రెయిన్ బూస్టింగ్ ఫుడ్స్ తీసుకోవాలి.
మధ్యాహ్న భోజనం
ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులకు అందించే మధ్యాహ్నం భోజనంలో కొంత మార్పులు చేస్తున్నారు. శారీరక బలం, మానసిక బలం పెంచేలా ఆహారాన్ని అందిస్తున్నారు. కానీ, దక్షిణ కొరియాలో చిన్నారులకు అందించే ఆహారం విషయంలో అక్కడి ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుంది. ప్రోటీన్ కోసం మాంసం, చేపలను తప్పకుండా వడ్డిస్తారు. దీంతో పాటు, తాజా ఆకుకూరలతో ఉడికించిన పదార్ధాన్ని పిల్లలకు అందిస్తారు. ఇది కొరియన్ సంప్రదాయ వంటకం. అంతేకాదు, పోషకాలతో కూడిన సూప్ తప్పనిసరి.
దక్షిణ కొరియా ప్రభుత్వం పిల్లలకు అందించే మధ్యాహ్నం భోజనంపై భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతుంది. నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదాన్ని కొరియా తూచా తప్పకుండా అనుసరిస్తుంది. భోజనం తయారుచేసేవారి దగ్గర నుంచి పాత్రల వరకు ప్రతిదీ శుభ్రంగా ఉండాల్సిందే. పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. పిల్లలు కూడా భోజనం చేసేముందు తప్పనిసరిగా శుభ్రతను పాటిస్తారు. నాణ్యమైన, రుచికరమైన ఆహారం తీసుకుంటే పిల్లల్లో ఏకాగ్రత పెరగడంతో పాటు, భవిష్యత్తులో వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని అక్కడి ప్రభుత్వం నమ్ముతుంది. మనం తీసుకునే ఆహారమే మనం. మనం చక్కగా, బలిష్టంగా, తెలివితేటలతో ఉండాలి అంటే ఆహారం కూడా ఆవిధంగానే ఉండాలని కొరియా చెబుతోంది.




