Donald Trump: వెనక్కి తగ్గిన ట్రంప్.. ఇరాన్‌దే పైచేయి

Donald Trump: ఇరాన్ ఎనర్జీ ప్లాంట్లపై దాడులను ఏప్రిల్ 6 రాత్రి 8 గంటల వరకు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.

Naresh.k
Published on: 27 March 2026 8:58 AM IST
Donald Trump
X

Donald Trump: వెనక్కి తగ్గిన ట్రంప్.. ఇరాన్‌దే పైచేయి

Iran: ప్రపంచం మొత్తం శ్వాస బిగబట్టి చూస్తున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఒక అనూహ్యమైన ప్రకటన వెలువడింది. ఇరాన్ ఎనర్జీ ప్లాంట్లపై దాడులు చేయడానికి సిద్ధమైన అమెరికా సైన్యం, అడుగు దూరంలో ఉండగానే ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇరాన్ అభ్యర్థన మేరకు, చర్చల కోసం మరో పది రోజులు సమయం ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఏప్రిల్ 6వ తేదీ రాత్రి 8 గంటల వరకు దాడులను నిలిపివేస్తున్నట్లు తెలపడం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.

చర్చలు సానుకూలం

ఇరానియన్లు చర్చలు జరపడంలో మేటి అంటూ ట్రంప్ చేసిన ప్రశంసలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. చర్చలు ప్రస్తుతం సానుకూల వాతావరణంలో సాగుతున్నాయని, అందుకే గడువును పెంచినట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే, ఇదే సమయంలో ఫేక్ న్యూస్ నమ్మవద్దని ఆయన ప్రపంచానికి విజ్ఞప్తి చేశారు. యుద్ధం రాకూడదని కోరుకునే సామాన్య ప్రజలకు ఇది పెద్ద రిలీఫ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే, ఇరాన్ ఎనర్జీ ప్లాంట్లపై దాడులు జరిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయని, ఆర్థిక సంక్షోభం తలెత్తుతుందని అందరూ ఆందోళన చెందుతున్నారు.

ఇరాన్ హెచ్చరిక

ట్రంప్ శాంతి మంత్రం జపిస్తున్నప్పటికీ, ఇరాన్ మాత్రం ఆయనను ఏ మాత్రం నమ్మడం లేదు. ట్రంప్ మాటలను నమ్మవద్దు.. సైనికులు ఎప్పుడూ అలర్ట్ గా ఉండాలి అంటూ ఇరాన్ తన బలగాలకు ఆదేశాలు జారీ చేసింది. గడువు పెంచడం అనేది అమెరికా వేస్తున్న ఎత్తుగడ కావచ్చని, దాడులకు ముందు వ్యూహాత్మక విరామంగా వారు భావిస్తున్నారు. ఈ పరస్పర విరుద్ధ ప్రకటనలతో మధ్యప్రాచ్యంలో పరిస్థితి 'నిప్పు మీద నీరు' పోసినట్టు కాకుండా, 'నివురు గప్పిన నిప్పు'లా ఉందనే చెప్పాలి.

ప్రపంచానికి ఊరట

ట్రంప్ తాజా ప్రకటనతో ఇంధన మార్కెట్లు ఒక్కసారిగా శాంతించాయి. పది రోజుల పాటు గడువు దొరకడంతో చమురు ధరల పెరుగుదలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఒకవేళ ఏప్రిల్ 6 నాటికి చర్చలు సఫలమైతే, అది ట్రంప్ దౌత్య నీతికి పెద్ద విజయంగా నిలుస్తుంది. లేని పక్షంలో, ఆ రాత్రి 8 గంటల తర్వాత ఏం జరుగుతుందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

Naresh.k

Naresh.k

Next Story