Hormuz Shipping Crisis: డీల్ కుదిరినా...కదలని నౌకలు...ప్రపంచాన్ని వెంటాడుతున్న మూడు భయాలు
ఇరాన్ అమెరికా మధ్య డీల్ కుదిరి ఒప్పందాలపై సంతకాలు చేసినా... వాస్తవంగా వాణిజ్య నౌకలు ప్రయాణం చేయడానికి మూడు ప్రధానమైన భయాలు వెంటాడుతున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
Hormuz Shipping Crisis: అమెరికా ఇరాన్ మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ప్రపంచ ఇంధన సంక్షోభానికి తెరదించుతుందని అందరూ భావించారు. జీ7లో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ ఇచ్చిన విందులో ఈ ఇరాన్‌తో శాంతి ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా తన ట్రూత్ ట్రంప్‌లో పేర్కొన్నారు. ప్రపంచ నౌకలారా ఇక మీ ఇంజన్లు స్టార్ట్ చేయండి...చమురును ప్రవహింపజేయండి అని రాసుకొచ్చాడు. డీల్ కుదిరినా...క్షేత్రస్థాయిలో నౌకలు కదలడలం లేదు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారరంగాన్ని మూడు ప్రధాన భయాలు వెంటాడుతున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
స్తంభించిన హార్ముజ్ జలసంధి
యుద్ధానికి ముందు ఈ అంతర్జాతీయ జలసంధి గుండా రోజుకు 120 నుండి 140 నౌకలు ప్రయాణించేవి. వీటి ద్వారా దాదాపు 2 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు రవాణా అయ్యేది. అయితే, ఫిబ్రవరిలో ఇజ్రాయెల్అ...మెరికా దాడుల తర్వాత ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేసింది. ఒప్పందం తర్వాత కూడా కేవలం 7 నౌకలు మాత్రమే దీని గుండా వెళ్లాయి. జలసంధికి ఇరువైపులా దాదాపు 550 కి పైగా నౌకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
నౌకాయానాన్ని భయపెడుతున్న మూడు ప్రధానమైన అంశాలు
యుద్ధసమయంలో ఇరాన్ సముద్రంలో పేలుడు పదార్ధాలను అమర్చింది. వీటిని పూర్తిగా తొలగించలేదు. పొరపాటున ఈ మార్గంలో నౌకలు ప్రయాణిస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. దీంతో షిప్పులు కదలకుండా అక్కడిక్కడే నిలిచిపోయాయి. యాజమాన్యం నుంచి సమాచారం వచ్చేంతవరకు కదలబోమని చెబుతున్నారు. అంతేకాదు, యుద్ధవాతావరణం వలన ఈ మార్గంలో ప్రయాణించే షిప్పుల భీమా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. రాజకీయ ఒప్పందాలు జరిగినంత మాత్రాన ఇన్సూరెన్స్ కంపెనీలు తమ ప్రీమియంలను వెంటనే తగ్గించవు. దీంతో పాటు ఇరాన్ ప్రస్తుతానికి 60 రోజుల పాటు ఉచిత ప్రయాణానికి అనుమతించినా, ఆ తర్వాత ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ నిబంధనలు ఎలా ఉంటాయో, ఎంత ట్యాక్స్ వసూలు చేస్తారో అనే సందిగ్ధత నెలకొంది. కాగితాల మీద ఒప్పందాలు జరగడం వేరు...సముద్రం మీద భద్రత లభించడం వేరు. నౌకల యాజమాన్యానికి నమ్మకం కలగడానికి కనీసం నాలుగు నెలల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. రాజకీయంగా అగ్రదేశాల నేతలు చేతులు కలిపినా అంతర్జాతీయంగా వాణ్యం పుంజుకోవడానికి మరికొంతకాలం వేచి ఉండక తప్పదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.




