Trump Secret Escape: ట్రంప్‌ సీక్రెట్‌ ఎస్కేప్‌... ఎయిర్‌పోర్ట్‌లో ఏం జరిగింది...ఎలా తప్పించుకున్నారో తెలుసా?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ టర్కీ నుంచి సీక్రెట్‌గా విమానంలో తప్పించుకున్నారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఇరాన్‌ నుంచి పొంచి ఉన్న ముప్పు నుండి బయటపడేందుకు ఈ విధంగా చేశారని అధికారులు పేర్కొన్నారు.

Balachander
Published on: 11 Aug 2026 12:17 PM IST
Trump Secret Escape: ట్రంప్‌ సీక్రెట్‌ ఎస్కేప్‌... ఎయిర్‌పోర్ట్‌లో ఏం జరిగింది...ఎలా తప్పించుకున్నారో తెలుసా?
X

Trump Secret Escape: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సీక్రెట్ ఎస్కేప్... అంతర్జాతీయ మీడియా కళ్లుగప్పి రహస్య ఆపరేషన్. ఇరాన్ నుంచి తీవ్ర ముప్పు... క్యాటరింగ్ వ్యాన్ ద్వారా రహస్య సైనిక విమానంలోకి షిఫ్ట్ అయిన ట్రంప్‌. అంకారా ఎయిర్‌పోర్ట్‌లో పక్కా డ్రామా... సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఆపరేషన్‌

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టర్కీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చే క్రమంలో చోటుచేసుకున్న దిగ్భ్రాంతికరమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టర్కీ రాజధాని అంకారా విమానాశ్రయం నుంచి ఆయన అధికారిక విమానం 'ఎయిర్ ఫోర్స్ వన్' లో బయలుదేరినట్లు వైట్‌హౌస్ ప్రపంచానికి వెల్లడించినప్పటికీ, నిజానికి ఆయన ఒక అత్యంత రహస్య సైనిక విమానంలో అక్కడి నుంచి సురక్షితంగా బయలుదేరారు. ఇరాన్ దేశం నుంచి ఎదురైన తీవ్రమైన భద్రతా ముప్పు కారణంగానే వైట్‌హౌస్ అధికారులు ఈ 'డిసెప్షన్ ఆపరేషన్' ఆచరించారని ప్రఖ్యాత అంతర్జాతీయ పత్రిక 'వాషింగ్టన్ పోస్ట్' తన కథనంలో సంచలనాత్మక నిజాలను బయటపెట్టింది.

అంకారా ఎయిర్‌పోర్ట్‌లో అసలేం జరిగింది?

నాటో శీతాకాల సమిట్ ముగించుకుని ట్రంప్ టర్కీ సరిహద్దుల వద్ద ఉన్న అంకారా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో టర్కీ పొరుగున ఉన్న ఇరాన్‌తో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ట్రంప్‌పై దాడి జరిగే అవకాశం ఉందన్న పక్కా నిఘా వర్గాల సమాచారంతో అమెరికా భద్రతా బృందం అప్రమత్తమైంది. టీవీ కెమెరాలు, అంతర్జాతీయ విలేకరులు చూస్తుండగానే ట్రంప్ యథావిధిగా తన ప్రధాన అధికారిక విమానం 'ఎయిర్ ఫోర్స్ వన్' ఎక్కారు. కానీ, విమానం ఎక్కిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే భద్రతా సిబ్బంది ఆయనను విమానానికి భోజన పదార్థాలు సరఫరా చేసే ఒక సాధారణ ఎయిర్‌పోర్ట్ క్యాటరింగ్ వ్యాన్‌లోకి అత్యంత రహస్యంగా మార్చారు. ఆ తరువాత ఆ క్యాటరింగ్‌ వ్యాన్‌ ద్వారా రన్‌వే దాటించి పక్కనే సిద్దంగా ఉన్న చిన్న శ్రేణి సైనిక విమానం ఎయిర్‌ఫోర్స్‌ సీ 32 ఏ లోకి ట్రంప్‌ను సురక్షితంగా ఎక్కించారు.

సీక్రెట్ ఆపరేషన్ విజయవంతం

ఈ 'డిసెప్షన్ ఆపరేషన్' ఎంత కట్టుదిట్టంగా జరిగిందంటే... ట్రంప్‌తో పాటు ప్రయాణిస్తున్న అమెరికా సీనియర్ పాత్రికేయులకు, చివరికి వైట్‌హౌస్ ఉన్నతాధికారులకు కూడా ఈ విషయం అస్సలు తెలియదు. ఈ కథనాన్ని 'న్యూయార్క్ టైమ్స్' పత్రిక కూడా తమ అధికారిక మూలాల ద్వారా ధ్రువీకరించింది. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో దేశాధ్యక్షుడి ప్రాణాలకు ముప్పు రాకుండా ఉండేందుకు అమెరికా నిఘా వర్గాలు వ్యూహాత్మకంగా రచించిన ఈ 'సీక్రెట్ ప్లాన్' ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story