Trump: ట్రంప్‌నోట యూరేనియం మాట...ఇరాన్‌తో కలిసి తవ్వితీస్తారట...
Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో అంతర్జాతీయ రాజకీయాలను కుదిపేశారు.
Trump
Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో అంతర్జాతీయ రాజకీయాలను కుదిపేశారు. భారత్-పాక్ ఘర్షణలతో సహా ఎనిమిదికిపైగా యుద్ధాలను తానే ఆపానని, లక్షలాది ప్రాణాలను కాపాడానని చెప్పుకుంటూనే.. ఇరాన్ యూరేనియం నిల్వలపై కన్నేసినట్లు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. ఇరాన్‌తో కలిసి యురేనియంను తవ్వి అమెరికాకు తీసుకెళ్తామని చెప్పడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.
యుద్ధాలను ఆపింది నేనే
తాను జరిపిన సంధి సూత్రం ఆధారంగానే ప్రపంచంలో పది వరకు యుద్ధాలు ఆగిపోయాయని... ఇందులో భారత్ పాక్ మధ్య జరిగిన ఘర్షణ కూడా ఉందని ట్రంప్ తెలిపాడు. భారత్ పాక్ ఘర్షణ విషయంలో తాను కలుగజేసుకొని ఉండకుంటే దాదాపు 30 నుంచి 50 మిలియన్ మంది ప్రాణాలు కోల్పోయేవారని పేర్కొన్నాడు. అంతేకాకుండా ఇప్పుడు లెబనాన్, ఇరాన్ యుద్ధాలను కలుపుకుంటే తాను అడ్డుకున్న యుద్ధాల సంఖ్య 10కి చేరినట్టు తెలిపారు. ప్రపంచంలో ఎక్కడ ఎటువంటి యుద్ధం జరిగినా తాను అడ్డుకుంటానని పరోక్షంగా తెలిపారు.
యురేనియం తవ్వకం
యుద్ధాల గురించే కాకుండా మరో ముఖ్యమైన విషయంపై కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇరాన్‌పై ఇజ్రాయిల్ అమెరికా విరుచుకుపడటానికి ప్రధాన కారణం యురేనియం. శుద్ది చేసిన యురేనియంతో ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేసుకుంటుందనే ఆరోపణలతో ఆ దేశంపై అమెరికా ఇజ్రాయిల్ విరుచుకుపడింది. కానీ, ఇప్పుడు ఇరాన్‌తో కలిసి పెద్ద పెద్ద యంత్రాలతో యురేనియంను తవ్వి అమెరికాకు తరలిస్తానని చెప్పడం ఆందర్నీ ఆశ్చర్యపరిచింది. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలను ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. అయితే, ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ ఘాటు రిప్లై ఇచ్చింది. తమ దేశంలో ఉన్న యురేనియం తమ భూభాగం లాంటిదేనని, దానిని ఎక్కడికీ తరలించబోమని స్పష్టం చేసింది. ఇది కేవలం రాజకీయ ప్రకటన మాత్రమేనని విమర్శించింది. ఇరాన్‌తో వదిలిపెట్టకుండా నాటో దేశాలపై కూడా తీవ్రమైన విమర్శలు చేశారు. నాటో కూటమి అవసరమైన సమయంలో సహాయం చేయలేదని, కానీ, ఇప్పుడు నాటోకు అవసరం కావడంతో సహాయం కావాలని ఫోన్ చేస్తున్నారని విమర్శించారు. నాటో కూటమిని పేపర్ టైగర్‌గా పేర్కొన్నాడు ట్రంప్.
హర్మూజ్ జలసంధి విషయంలో కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వాణిజ్య నౌకాయానం తిరిగి ప్రారంభమైందని, కానీ పూర్తి ఒప్పందం కుదిరే వరకు అమెరికా నౌకాదళ నిర్బంధం కొనసాగుతుందని తెలిపారు. హర్మూజ్ మార్గం ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20% రవాణా జరుగుతుండటం దీని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.




