True Story: పోలీసుల నుంచి తప్పించుకోవడానికి 13 ఏళ్లుగా ఆ గోడలోనే.. అసలు ఎలా బతికాడో ?

True Story: ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి, కానీ కొన్ని మాత్రం ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి.

CR Reddy
Published on: 25 Sept 2026 6:16 AM IST
Syrian man
X

Syrian man

True Story: ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి, కానీ కొన్ని మాత్రం ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. సిరియా దేశానికి చెందిన మొహమ్మద్ జకౌర్ అనే వ్యక్తి చేసిన సాహసం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. సిరియాలో బషర్ అల్-అస్సద్ ప్రభుత్వ పాలన కాలంలో ఆయనకు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు చెలరేగాయి. ఆ సమయంలో అస్సద్ ప్రభుత్వ పోలీసులు జకౌర్‌ను అరెస్టు చేయడానికి తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. తనను పోలీసులు మూడోసారి అరెస్టు చేసి చిత్రహింసలు పెడతారనే భయంతో జకౌర్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఎలాగైనా ప్రాణాలు కాపాడుకోవాలని ఆలోచించిన ఆయన, చివరికి ఎవరూ ఊహించని ఒక అసాధారణ నిర్ణయం తీసుకున్నాడు.

13 ఏళ్ల పాటు చిన్న ఫ్రిజ్‌లోనే అజ్ఞాతవాసం

పోలీసుల కంట పడకుండా ఉండటం కోసం జకౌర్ తన ఇంటిలోని కేవలం ఒక మీటర్ పొడవు ఉండే చిన్న కాంక్రీట్ గోడలో తలదాచుకున్నాడు. సరిగ్గా అక్కడే దాదాపు 13 సంవత్సరాల పాటు ఎవరికీ కనిపించకుండా జీవించాడు. ఆ సుదీర్ఘ కాలంలో ఆయన ఒక్కసారి కూడా సూర్యరశ్మిని చూడలేదు. కేవలం ఆయన భార్యకు మాత్రమే ఆయన బతికి ఉన్నారనే నిజం తెలుసు. భార్య వేసిన ఒక చిన్న రంధ్రం ద్వారా ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఆహారాన్ని తీసుకునేవాడు. పోలీసులు అనేకసార్లు జకౌర్ ఇంటికి వచ్చి సోదాలు చేసినప్పటికీ, ఆయన ఆ ఫ్రిజ్‌లో ఉన్నాడనే విషయం ఎవరికీ ఎప్పటికీ అర్థం కాలేదు.

చనిపోయాడని భావించి సంతాప సభ

మొహమ్మద్ జకౌర్ ఆచూకీ ఏ కోశానా లభించకపోవడంతో, ఆయన ఎటో వెళ్లిపోయి చనిపోయి ఉంటాడని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బలంగా నమ్మారు. దీంతో వారు అందరూ కలిసి జకౌర్ కోసం ఒక సంతాప సభను కూడా నిర్వహించారు. ఆ విషాద కార్యక్రమంలో ఆయన భార్య, కుమారుడితో పాటు టర్కీలో నివసిస్తున్న ఆయన సోదరుడు కూడా పాల్గొని నివాళులు అర్పించారు. పిల్లలందరూ తమ తండ్రి ప్రాణాలు కోల్పోయాడని తీవ్ర వేదనలో గడిపారు. జకౌర్ అనారోగ్యానికి గురైనప్పుడల్లా ఆయన భార్య రహస్యంగా డాక్టర్ వద్దకు వెళ్లి మందులు తెచ్చి ఇచ్చి ఆయన ప్రాణాలను కాపాడుకుంటూ వచ్చింది.

చివరకు ఫ్రిజ్ బద్దలు కొట్టి బయటకు వచ్చిన వైనం

సిరియాలో డిసెంబర్ 2024లో తిరుగుబాటు దళాలు, విద్రోహ గూఠాలు బషర్ అల్-అస్సద్ ప్రభుత్వాన్ని గద్దె దించాయి. అస్సద్ పాలన పూర్తిగా అంతం కావడంతో జకౌర్‌కు ప్రాణభయం తొలగిపోయింది. ఆ తర్వాత ఆయన 13 ఏళ్ల పాటు తలదాచుకున్న ఆ గోడను బద్దలు కొట్టి వెలుపలికి వచ్చాడు. అయితే సుదీర్ఘకాలం పాటు తండ్రిని చూడకపోవడంతో ఆయన పిల్లలు మొదట ఆయనను తమ తండ్రిగా గుర్తించడానికి నిరాకరించారు. ప్రస్తుతం జకౌర్ కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ, తన దేశం కోసం, స్వేచ్ఛ కోసం తాను పడిన కష్టాలు ఫలించాయని, అస్సద్ పాలన అంతం కావడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నానని ఆయన తెలిపారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.