US Green Card: అమెరికా డ్రీమ్‌కు పెద్ద షాక్.. గ్రీన్ కార్డ్ రావాలంటే 179 ఏళ్లు ఆగాల్సిందే ?

US Green Card: అమెరికాలో స్థిరపడాలని కలలు కనే భారతీయ ఉద్యోగులకు కోలుకోలేని షాక్ తగిలింది.

CR Reddy
Published on: 3 Sept 2026 6:45 AM IST
US Green Card
X

US Green Card

US Green Card: అమెరికాలో స్థిరపడాలని కలలు కనే భారతీయ ఉద్యోగులకు కోలుకోలేని షాక్ తగిలింది. ఈ ఏడాదిన కొత్తగా గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే భారతీయులకు పౌరసత్వం దక్కాలంటే దాదాపు 179 ఏళ్ల సమయం పడుతుందని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (ఎన్ఎఫ్ఏపి) వెల్లడించింది. అమెరికా వర్కింగ్ వీసాలపై పనిచేస్తున్న మన దేశ నిపుణులకు గ్రీన్ కార్డ్ లభించడం గగనంగా మారింది. అమెరికా పౌరసత్వ విభాగం లెక్కల ప్రకారం ఈ ఏడాదిన ఈబి-2 క్యాటగిరీ కింద దరఖాస్తు చేసే భారతీయులు క్యూ లైన్‌లో 179 ఏళ్లు నిరీక్షించక తప్పదు. ప్రతీ దేశానికి ఏటా ఇచ్చే గ్రీన్ కార్డ్ కోటాలో 7 శాతం పరిమితి విధించడమే ఈ దారుణ పరిస్థితికి ముఖ్య కారణం. మన దేశం నుంచి అత్యంత ప్రతిభావంతులైన ఐటీ నిపుణులు, ఇంజనీర్లు లక్షల సంఖ్యలో వెళ్తున్నప్పటికీ కోటా పరిమితి వల్ల తీవ్ర అన్యాయం జరుగుతోంది.

క్యూలో దాదాపు 10 లక్షల మంది భారతీయులు

అమెరికాలో ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకుని బ్యాక్‌లాగ్‌లో చిక్కుకుపోయిన వారి సంఖ్య డిసెంబర్ నాటికి ఏకంగా 12.6 లక్షలకు చేరింది. ఇందులో దాదాపు 10 లక్షల మంది కేవలం భారతీయులే కావడం గమనార్హం. అంటే మొత్తం బ్యాక్‌లాగ్‌లో 79 శాతం వాటా మన దేశస్థులదే కావడం గమనార్హం. ఐదేళ్ల క్రితం 10.5 లక్షలుగా ఉన్న ఈ పెండింగ్ దరఖాస్తుల సంఖ్య ఏకంగా 20 శాతానికి పైగా పెరిగింది. ప్రతీ సంవత్సరం జారీ చేసే గ్రీన్ కార్డుల సంఖ్య పరిమితంగా ఉండటంతో ఈ వెయిటింగ్ లిస్ట్ నిరంతరం పెరుగుతోంది.

వివిధ విభాగాల్లో నిరీక్షణ కాలం

ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డులలో ప్రధానంగా మూడు విభాగాలు ఉంటాయి.

* ఈబి-1 విభాగం: టాలెంట్ పర్సన్లు, రీసెర్చర్లు, మల్టీ నేషనల్ కంపెనీల మేనేజర్లకు దాదాపు 4 నుంచి 5 ఏళ్ల సమయం పడుతుంది.

* ఈబి-2 విభాగం: ఉన్నత విద్యార్హతలు ఉన్న నిపుణులకు గరిష్టంగా 179 ఏళ్ల నిరీక్షణ తప్పదు.

* ఈబి-3 విభాగం: బ్యాచిలర్ డిగ్రీ కలిగిన సాంకేతిక ఉద్యోగులకు 38 ఏళ్ల వరకు సమయం పడుతోంది.

చైనాతో పోలిస్తే దారుణమైన వివక్ష

చైనా పౌరులతో పోలిస్తే భారతీయులకు పడుతున్న సమయం చాలా ఎక్కువ. చైనా నుంచి దరఖాస్తు చేసుకున్న వారికి ఈబి-2 కింద 25 ఏళ్లు, ఈబి-3 కింద కేవలం 7 ఏళ్లు మాత్రమే పడుతోంది. కోటా విధానంలో మార్పులు చేయకపోతే రాబోయే రోజుల్లో భారతీయ నిపుణులు అమెరికాలో గ్రీన్ కార్డ్ సాధించడం అసాధ్యంగా మారనుంది. తాత్కాలిక వీసాలపైనే జీవితం గడపాల్సి వస్తోందని అనేకమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story