Robert F Kennedy Jr: అమెరికా మంత్రిని కాటేసిన పాము.. చేతులతో పట్టుకోబోతే షాకింగ్ సీన్..
Robert F Kennedy Jr: అమెరికా ఆరోగ్య మంత్రి రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్‌ను పాము కాటేసింది. ఫ్లోరిడాలో రెండు పాములను చేతులతో పట్టుకునేందుకు ప్రయత్నించగా ఈ ఘటన జరిగింది.
Robert F Kennedy Jr: అమెరికా మంత్రిని కాటేసిన పాము.. చేతులతో పట్టుకోబోతే షాకింగ్ సీన్..
Robert F Kennedy Jr: పాములను పట్టుకోవాలనే అత్యుత్సాహం అమెరికాకు చెందిన ఓ కీలక మంత్రికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. అమెరికా ఆరోగ్య, మానవ సేవల కార్యదర్శి (Health and Human Services Secretary) రాబర్ట్ ఎఫ్.కెన్నెడీ జూనియర్ (Robert F Kennedy Jr)ను ఓ పాము కాటేసింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో పంచుకోవడంతో, ఆ వీడియో కాస్తా ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
ఫ్లోరిడాలోని ప్రముఖ సెలబ్రిటీ వైద్యుడు 'డాక్టర్ ఓజ్' నివాసంలో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఉన్న రెండు 'బ్లాక్ రేసర్' (Black Racer) జాతికి చెందిన సర్పాలను రాబర్ట్ ఎఫ్.కెన్నెడీ జూనియర్ తన చేతులతో పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయితే, వాటిని లొంగదీసుకునే క్రమంలో.. ఒక పాము ఒక్కసారిగా ఎదురుదాడి చేసి ఆయన చేతిపై గట్టిగా కాటు వేసింది.
కెన్నెడీని కాటేసిన 'బ్లాక్ రేసర్' జాతి పాములు సాధారణంగా విషపూరితమైనవి కావు. దీంతో ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. పెద్ద ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
రాబర్ట్ ఎఫ్.కెన్నెడీ జూనియర్‌కు వన్యప్రాణులు, వింత జంతువులంటే ఎంతో ఆసక్తి. ఈ క్రమంలోనే ఆయన గతంలో పలు వివాదాల్లోనూ చిక్కుకున్నారు. ఒకసారి న్యూయార్క్ హైవే పక్కన చనిపోయి పడి ఉన్న 'రక్కూన్' (ఒక రకమైన అడవి జంతువు)ను చూసి, దాని శరీర భాగాన్ని కత్తిరించి తన వెంట తీసుకువెళ్లారు.
ఆ సమయంలో ఈ వ్యవహారంపై అమెరికాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే ఆ శరీర భాగంపై పరిశోధనలు (Research) చేయడానికే తాను అలా తీసుకున్నట్లు కెన్నెడీ అప్పట్లో వివరణ ఇచ్చారు. తాజాగా ఇప్పుడు నేరుగా పాములతోనే ఆటలాడి కాటు వేయించుకోవడంతో ఆయన పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది.




