US-Iran Peace Talks: ఇరాన్ నో.. ట్రంప్ ఎస్! చర్చల పునరుద్ధరణపై కొనసాగుతున్న సస్పెన్స్
US-Iran Peace Talks: అమెరికా మరియు ఇరాన్ మధ్య శాంతి చర్చల పునరుద్ధరణకు ట్రంప్ సిద్ధమయ్యారు.
US-Iran Peace Talks: ఇరాన్ నో.. ట్రంప్ ఎస్! చర్చల పునరుద్ధరణపై కొనసాగుతున్న సస్పెన్స్
US-Iran Peace Talks: అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా-ఇరాన్ సంబంధాలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. నెలన్నర పాటు సాగిన భీకర యుద్ధం తర్వాత, ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు పాకిస్థాన్ వేదికగా చర్చలు జరగనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే, ఈ చర్చలపై ఇరాన్ విభిన్నమైన ప్రకటన చేయడం గందరగోళానికి దారితీసింది.
రాబోయే రెండు రోజుల్లో ఇరాన్‌తో చర్చలు జరగనున్నాయని ట్రంప్ వెల్లడించారు. ఈ విషయంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. పాక్ వేదికగా చర్చలు జరిపేందుకు తాను మొగ్గు చూపుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
గతంలో జరిగిన చర్చల సమయంలో 'హిజ్బుల్లా'కు నిధుల నిలిపివేతపై అమెరికా పెట్టిన నిబంధనను ఇరాన్ తిరస్కరించడంతో చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. తాజాగా, ట్రంప్ ప్రకటనపై ఇరాన్ స్పందిస్తూ.. పాకిస్థాన్‌తో తమకు ఎలాంటి సందేశాల మార్పిడి జరగలేదని, మలివిడత చర్చలపై తమ వద్ద సమాచారం లేదని కుండబద్దలు కొట్టింది. దీంతో శాంతి చర్చల పునరుద్ధరణపై ఉత్కంఠ కొనసాగుతోంది.




