US Iran War Crisis: ఇరాన్‌పై అమెరికా ఎయిర్ స్ట్రైక్స్.. గల్ఫ్ దేశాల్లోని యూఎస్ బేస్‌లపై ఇరాన్ రివర్స్ ఎటాక్!
US Iran War Crisis: పశ్చిమాసియాలో ముదిరిన యుద్ధ మేఘాలు! ఇరాన్‌పై అమెరికా భీకర వైమానిక దాడులు.. ప్రతికారంగా బహ్రెయిన్, కువైట్, జోర్దాన్‌లోని యూఎస్ సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణుల వర్షం.
US Iran War Crisis: ఇరాన్‌పై అమెరికా ఎయిర్ స్ట్రైక్స్.. గల్ఫ్ దేశాల్లోని యూఎస్ బేస్‌లపై ఇరాన్ రివర్స్ ఎటాక్!
US Iran War Crisis: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ చర్చల ప్రక్రియను ఉద్దేశ్యపూర్వకంగా ఆలస్యం చేస్తుందని ఆరోపిస్తూ అమెరికా ఇరాన్ పై బీకరదాడులకు దిగింది. అమెరికా బలగాలు తాజాహా దక్షిణ ఇరాన్ లోని పలు కీలక లక్ష్యాలపై భారీ వైమానిక దాడులు నిర్వహించాయి. ముఖ్యంగా హర్మూజ్ జలసంధికి సమీపంలోని వ్యూహాత్మక ప్రాంతాలు, రాడార్ కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, సైనిక మౌలిక సదుపాయాలే ప్రదాన లక్ష్యం చేసుకున్నాయి.
ప్రపంచ దేశాలకు ఇరాన్ మరోసారి పెద్ద షాక్ ఇచ్చింది. అమెరికా చర్యలపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా బహ్రెయిన్, జోర్దాన్, కువైట్ తదితర దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడికి పాల్పడింది. ఇరాన్ ప్రయోగించిన ఐదు క్షిపణులను అడ్డుకున్నామని, ఎలాంటి నష్టం జరగలేదని జోర్దాన్ ప్రకటించింది. బహ్రెయిన్, కువైట్లలో సైరన్లు మోగాయి.
హర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేసింది. అమెరికా తాజా వైమానికి దాడులకు ప్రతికారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇరాన్ ప్రకటించింది. చమురు ట్యాంకర్లు, సరుకు రవాణా నౌకలు, వాణిజ్య నౌకలు సహా ఏ దేశానికి చెందిన ఓడకు హర్మూజ్ మార్గంలో ప్రయాణానికి అనుమతి ఉండదని స్పష్టం చేసింది. నిషేధాన్ని ఉల్లంఘించి ఎవరైనా హర్మూజ్ జలసంధిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే క్షిపణులు, నౌకదళ బలగాలతో లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేస్తామని ఇరాన్ సైనికాధికారులు ప్రకటించారు. ఈ ప్రకటనతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి.
తాజా పరిణామాలు చూస్తే అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తలు కేవలం పరిమిత ప్రతీకార దాడుల దశలోనే కాకుండా మరింత విస్తృత ఘర్షణ వైపు దారితీసే ప్రమాదం కనిపిస్తుంది. ముఖ్యంగా హార్మూజ్ జలసంధి భద్రత, చమురు సరఫరాలు, గల్ఫ్ దేశాల స్థిరత్వం ఈ సంక్షభం ప్రభావం చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.




