US Iran War: ఇరాన్‌పై అమెరికా ముందస్తు దాడి.. క్షిపణి స్థావరాలు, నేవీ బేస్ ధ్వంసం, నలుగురు సైనికులు మృతి!

US Iran War: అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేగింది. ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదురుతుందనుకున్న తరుణంలోనే అమెరికా బాంబుల వర్షం కురిపించింది.

Arun Chilukuri
Published on: 26 May 2026 12:07 PM IST
US Iran War
X

US Iran War: ఇరాన్‌పై అమెరికా ముందస్తు దాడి.. క్షిపణి స్థావరాలు, నేవీ బేస్ ధ్వంసం, నలుగురు సైనికులు మృతి!

US Iran War: నేడో, రేపో ఇరాన్‌తో అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదురుతుందని ప్రపంచ దేశాలు భావించాయి. ఈ నేపథ్యంలో అమెరికా మరోసారి తన ఆయుధాలకు పని చెప్పింది. ఇరాన్‌లోని దక్షిణ ప్రాంతాలపై తీవ్రమైన దాడులు చేసింది. బందర్‌ అబ్బాస్‌ సహా, పలు ప్రాంతాల్లోని సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది. ఆత్మరక్షణ కోసమే తాము ఇరాన్‌ క్షిపణి ప్రయోగ లాంచ్‌ప్యాడ్లు, సముద్రంలో మందుపాతరలు పరిచే బోట్లను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ప్రతినిధి టిమోతీ హాకిన్స్‌ వెల్లడించారు.

తమ దేశానికి చెందిన రెండు విమాన వాహక నౌకలు, రెండు డజన్లకు పైగా యుద్ధ నౌకలకు తీరం వెంట ఉన్న ఇరాన్‌ క్షిపణి స్థావరాలు ముప్పుగా పరిగణించినట్లు తెలిపారు. ఈ దాడిలో బందర్‌ అబ్బాస్‌ పోర్టులోని నేవీ బేస్‌ కూడా ధ్వంసమైనట్లు వెల్లడించారు. అమెరికా దాడుల్లో న‌లుగురు ఇరానీ రెవ‌ల్యూష‌న‌రీ గార్డు స‌భ్యులు మృతి చెందిన‌ట్లు తెలిసింది. అమెరికా దాడులు చేసినా.. ఇరాన్‌తో త్వరలో డీల్‌ కుదిరే అవకాశాలు ఉన్నట్లు విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story